WI vs ENG : చారిత్రాత్మ‌క విజ‌యం.. 24 ఏళ్ల త‌రువాత ఇంగ్లాండ్ పై సిరీస్ గెలిచిన వెస్టిండీస్..

వెస్టిండీస్ జ‌ట్టు సొంత గ‌డ్డ‌పై 25 ఏళ్ల త‌రువాత ఇంగ్లాండ్ పై వ‌న్డే సిరీస్‌ను నెగ్గింది.

WI vs ENG : చారిత్రాత్మ‌క విజ‌యం.. 24 ఏళ్ల త‌రువాత ఇంగ్లాండ్ పై సిరీస్ గెలిచిన వెస్టిండీస్..

West Indies

West Indies vs England : వెస్టిండీస్ జ‌ట్టు సొంత గ‌డ్డ‌పై 25 ఏళ్ల త‌రువాత ఇంగ్లాండ్ పై వ‌న్డే సిరీస్‌ను నెగ్గింది. బార్బ‌డోస్ వేదిక‌గా జ‌రిగిన నిర్ణ‌యాత్మ‌క‌మైన మూడో వ‌న్డేలో విండీస్ జ‌ట్టు విజ‌యం సాధించింది. వ‌రుణుడు ప‌లుమార్లు అంత‌రాయం కలిగించిన ఈ మ్యాచులో వెస్టిండీస్ జ‌ట్టు డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. త‌ద్వారా మూడు వ‌న్డేల సిరీస్‌ను 2-1తో కైవ‌సం చేసుకుంది.

వ‌ర్షం కార‌ణంగా మ్యాచును 40 ఓవ‌ర్ల‌కు కుదించారు. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 40 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 206 ప‌రుగులు చేసింది. బెన్‌ డకెట్ (71) హాఫ్ సెంచ‌రీ చేయ‌గా లియామ్ లివింగ్ స్టోన్ (45) రాణించాడు. ఫిలిప్ సాల్ట్ (4), విల్ జాక్స్ (17), జాక్ క్రాలే(0), హ్యారీ బ్రూక్(1), జోస్ బట్లర్ (0)లు విఫ‌లం అయ్యారు. వెస్టిండీస్ బౌల‌ర్ల‌లో మాథ్యూ ఫోర్డే, జోషఫ్‌య చెరో మూడు వికెట్లు తీశారు. షెపెర్డ్‌ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

BCCI : ఏడాదికి బీసీసీఐ ఆదాయం ఎంతో తెలుసా..? ఆస్ట్రేలియాతో పోలిస్తే ఎక్కువా..? త‌క్కువా..?

అనంత‌రం డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం వెస్టిండీస్ ల‌క్ష్యాన్ని 188గా నిర్ణ‌యించారు. ఈ ల‌క్ష్యాన్ని విండీస్ 31.4 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. విండీస్ బ్యాట‌ర్ల‌లో కార్టీ(50; 58 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), ఆథనాజ్‌(45; 51 బంతుల్లో 7 ఫోర్లు), రొమారియో షెపర్డ్ (41నాటౌట్; 28 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) రాణించారు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో విల్ జాక్స్ మూడు వికెట్లు తీయ‌గా, గుస్ అట్కిన్సన్ రెండు, రెహాన్ అహ్మద్ ఓ వికెట్ సాధించాడు. వ‌న్డే సిరీస్ ఆసాంతం రాణించిన విండీస్ కెప్టెన్ షై హోప్ కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ల‌భించింది.