×
Ad

WTC Points Table 2027 : ఇదేం క‌ర్మ‌రా సామీ.. ఒక్క మ్యాచ్ గెల‌వ‌గానే రెండో స్థానంలోకి పాక్‌.. డ‌బ్ల్యూటీసీలో ప‌డిపోయిన భార‌త్ ర్యాంక్‌..

ద‌క్షిణాఫ్రికా పై పాకిస్తాన్ విజ‌యం సాధించ‌డంతో డ‌బ్ల్యూటీసీ పాయింట్ల ప‌ట్టిక‌లో (WTC Points Table 2027) భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.

Big Change In WTC Table 2027 India Falls Pakistan Rises

WTC Points Table 2027 : ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ 2025-27 సీజ‌న్‌లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. లాహోర్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో పాక్ 93 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

ఈ నేప‌థ్యంలో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో (WTC Points Table 2027) పాకిస్తాన్ రెండో స్థానానికి దూసుకువ‌చ్చింది. ఈ సైకిల్‌లో ఆడిన ఒక్క మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డం ద్వారా 100 శాతం విజ‌య‌శాతంతో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా టాప్‌-2లో నిలిచింది. మ‌రోవైపు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించిన ఆస్ట్రేలియా సైతం 100 విజ‌య‌శాతంతో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది.

Womens World Cup 2025 : ఆసీస్ చేతిలో ఓట‌మి.. టీమ్ఇండియాకు ఐసీసీ భారీ జ‌రిమానా..

పాకిస్తాన్ రెండో స్థానంలోకి దూసుకురావ‌డంతో మిగిలిన జ‌ట్లు ఒక్కొ స్థానాన్ని దిగ‌జారాయి. రెండో స్థానంలో ఉన్న శ్రీలంక మూడో స్థానానికి ప‌డిపోగా, వెస్టిండీస్ పై గెలిచి మూడో స్థానంలో ఉన్న భార‌త్ నాలుగో స్థానానికి ప‌డిపోయింది.

లంక జ‌ట్టు రెండు మ్యాచ్‌లు ఆడ‌గా ఓ మ్యాచ్‌లో గెలిచింది. మ‌రో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. లంక జ‌ట్టు 66.67 విజ‌య‌శాతం క‌లిగి ఉంది. ఇక భార‌త్ విష‌యానికి వ‌స్తే.. ఏడు మ్యాచ్‌లు ఆడ‌గా నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోగా, మ‌రో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. భార‌త్ విజ‌య‌శాతం 61.90గా ఉంది.

AFG vs BAN : 7, 3, 7, 6, 0, 2, 4, 5, 9 ఇది ఫోన్ నంబ‌ర్ కాదండి బాబు.. బంగ్లా బ్యాట‌ర్ల క‌ష్టార్జితం..

ఆ త‌రువాత ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్, వెస్టిండీలు వ‌రుస‌గా ఐదు, ఆరు, ఏడు, స్థానాల్లో ఉన్నాయి. ఈ సైకిల్‌లో ఆడిన ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయిన ద‌క్షిణాఫ్రికా ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇక న్యూజిలాండ్ ఈ సైకిల్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క మ్యాచ్ కూడా ఆడ‌లేదు.