Womens World Cup 2025 : ఆసీస్ చేతిలో ఓటమి.. టీమ్ఇండియాకు ఐసీసీ భారీ జరిమానా..
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Womens World Cup 2025) భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో ఓడిపోయిన బాధలో ఉన్న భారత్‌కు ఐసీసీ షాకిచ్చింది.

Womens World Cup 2025 India fined for slow over rate against Australia
Womens World Cup 2025 : మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భారత్‌కు కలిసి రావడం లేదు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో (శ్రీలంక, పాకిస్తాన్) విజయం సాధించి ఊపుమీద కనిపించిన భారత్ ఆ తరువాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో చితికిల పడింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడంతో భారత్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేశాయి.
ఆస్ట్రేలియా పై 330 పరుగులు చేసి కూడా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. ఆసీస్ చేతిలో ఓడిపోయిన బాధలో ఉన్న భారత్‌కు మరో షాక్ తగిలింది. భారత మహిళా జట్టుకు ఐసీసీ జరిమానా విధించింది. విశాఖ వేదికగా ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా స్లో ఓవర్ రేటు నమోదు చేయడంతో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజుల్లో 5 శాతం ఫైన్ వేసింది.
Mohammed shami : నాలుగు రోజులు ఆడగలిగినప్పుడు.. 50 ఓవర్లు ఆడలేనా.. షమీ సంచలన వ్యాఖ్యలు..
‘ఐసీసీ ప్రవర్తనా నియమావళిని 2.22 ప్రకారం నిర్దేశిత సమయంలో భారత్ ఓవర్ల కోటాను పూర్తి చేయలేదు. నిర్దేశిత సమయానికి ఓ ఓవర్ తక్కువగా వేయడంతో భారత ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానాగా విధించాం. టీమ్ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తప్పిదాన్ని, శిక్షను అంగీకరించింది. దీనిపై తదుపరి ఎలాంటి విచారణ ఉండదు.’ అని ఐసీసీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.
India have been fined for slow over-rate during their game against Australia at #CWC25.
Details ⬇️https://t.co/qp2hmAzB3i
— ICC (@ICC) October 15, 2025
టీమ్ఇండియా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. తన తదుపరి మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌తో ఆడనుంది. ఇండోర్ వేదికగా అక్టోబర్ 19న ఈ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం భారత్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. తొలి మూడు స్థానాల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలు ఉన్నాయి.
SL vs NZ : వర్షం కారణంగా శ్రీలంక, న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు.. భారత్‌కు లాభం?
భారత్ సెమీస్ చేరుకోవాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సి ఉంది. అప్పుడు ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ఈజీగా సెమీస్‌లో అడుగుపెడుతుంది.