Mohammed shami : నాలుగు రోజులు ఆడగలిగినప్పుడు.. 50 ఓవర్లు ఆడలేనా.. షమీ సంచలన వ్యాఖ్యలు..
టీమ్ఇండియా సెలక్టర్లపై వెటరన్ పేసర్ మహ్మద్ షమీ (Mohammed shami) తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

Mohammed Shami Slams Indian Selectors after australia odis snub
Mohammed shami : టీమ్ఇండియా సెలక్టర్లపై వెటరన్ పేసర్ మహ్మద్ షమీ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనకు తనను పరిగణలోకి తీసుకోకపోవడంపై అతడు మండిపడ్డాడు. తాను ఫిట్‌గానే ఉన్నానని చెప్పుకొచ్చాడు. అందుకనే రంజీ ట్రోఫీలో బెంగాల్ తరుపున ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.
ఈ నెల 19 నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరీసులు ప్రారంభం కానున్నాయి. తొలుత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, ఆ తరువాత ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ రెండు సిరీసుల్లో పాల్గొనే భారత జట్లను ఇప్పటికే బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ రెండు జట్లలోనూ షమీకి సెలక్టర్లు చోటు ఇవ్వలేదు. షమీ ఫిట్‌నెస్ పై తమకు ఎలాంటి సమాచారం లేదని, అందుకనే అతడిని పరిగణలోకి తీసుకోలేదని జట్లను ప్రకటించిన సమయంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చెప్పాడు.
SL vs NZ : వర్షం కారణంగా శ్రీలంక, న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు.. భారత్‌కు లాభం?
తాజాగా దీనిపై షమీ స్పందించాడు. ఫిట్‌నెస్ గురించి సెలెక్షన్ కమిటీకి సమాచారం అందించడం తన పని కాదన్నాడు. ఎంపిక అనేది తన చేతుల్లో లేదన్నాడు. తనకు ఏమైనా ఫిట్‌నెస్ సమస్యలు ఉంటే బెంగాల్ తరుపున రంజీ క్రికెట్ ఎందుకు ఆడతానని ప్రశ్నించాడు. టీమ్ సెలక్షన్ గురించి మాట్లాడి వివాదం సృష్టించాల్సిన అవసరం లేదన్నాడు.
రంజీ ట్రోఫీలో 4 రోజుల మ్యాచ్ ఆడగలిగినప్పుడు 50 ఓవర్ల క్రికెట్లోనూ బరిలో దిగగలనని చెప్పుకొచ్చాడు. ఫిట్‌నెస్ గురించి అడగడం, చెప్పడం, సమాచారం ఇవ్వడం తన బాధ్యత కాదన్నాడు. ఎన్‌సీఏకు వెళ్లి సిద్దమవ్వడం, మ్యాచ్ ఆడడం మాత్రమే తన పని చెప్పుకొచ్చాడు.
AFG vs BAN : 7, 3, 7, 6, 0, 2, 4, 5, 9 ఇది ఫోన్ నంబర్ కాదండి బాబు.. బంగ్లా బ్యాటర్ల కష్టార్జితం..
బుధవారం నుంచి రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ ప్రారంభం కానుంది. పశ్చిమ బెంగాల్ జట్టు ఉత్తరాఖండ్‌తో తలపడనుంది.