Big Cricket League : బిగ్ క్రికెట్ లీగ్ తొలి సీజన్ షెడ్యూల్ వచ్చేసింది.. డిసెంబర్ 12 నుంచి..
బిగ్ క్రికెట్ లీగ్(బీసీఎల్)కు సంబంధించిన షెడ్యూల్ వచ్చేసింది

Big Cricket League 2024 schedule out now
బిగ్ క్రికెట్ లీగ్(బీసీఎల్)కు సంబంధించిన షెడ్యూల్ వచ్చేసింది. బీసీఎల్ తొలి సీజన్ డిసెంబర్ 12 నుంచి సూరత్‌లో ప్రారంభం కానుంది. మొత్తం ఆరు జట్లు నార్తర్న్ ఛాలెంజర్స్, యుపి బ్రిజ్ స్టార్స్, రాజస్థాన్ రీగల్స్, ఎంపి టైగర్స్, ముంబై మెరైన్స్, సదరన్ స్పార్టాన్స్ లు పాల్గొనున్నాయి.
టీమ్ఇండియా మాజీ ఆటగాళ్లు సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, శిఖర్ ధావన్, యూసఫ్ పఠాన్, ఇమ్రాన్ తాహిర్, తిలకరత్నే దిల్షాన్ వంటి స్టార్లు తమ తమ జట్లకు నాయకత్వం వహించనున్నారు. ఇటీవలే బీసీఎల్ వేలాన్ని నిర్వహించారు. ప్రతి జట్టు ఆరుగురు మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లు, ఆరుగురు మాజీ భారత ఫస్ట్-క్లాస్ క్రికెటర్లు, 10 మంది స్థానిక ఔత్సాహిక క్రికెటర్లతో సహా గరిష్టంగా 18 మంది ఆటగాళ్లను ప్రతి ఫ్రాంచైజీ తీసుకుంది.
ఫైనల్ మ్యాచ్‌తో కలిపి మొత్తం 18 మ్యాచులు జరగనున్నాయి. డిసెంబర్ 12 ప్రారంభం కానున్న ఈ టోర్నీ డిసెంబర్ 22న ముగియనుంది. ప్రారంభ రోజు ఒక్క మ్యాచ్ మాత్రమే జరగనుంది. మిగిలిన రోజుల్లో రెండేసి చొప్పున మ్యాచులను నిర్వహించనున్నారు.
టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌లో సదరన్ స్పార్టాన్స్, నార్తర్న్ ఛాలెంజర్స్ తలపడనున్నాయి.
IND vs AUS : ఆసీస్‌తో రెండో టెస్టు.. టీమ్ఇండియా ప్లాన్‌ను లీక్ చేసిన కేఎల్ రాహుల్..!
బీసీఎల్ షెడ్యూల్ ఇదే..
డిసెంబర్ 12న – సదరన్ స్పార్టాన్స్ వర్సెస్ నార్తర్న్ ఛాలెంజర్స్ (రాత్రి 7.30 గంటలకు)
డిసెంబర్ 13న – రాజస్థాన్ రీగల్స్ వర్సెస్ సదరన్ స్పార్టాన్స్ (మధ్యాహ్నం 3 గంటలకు)
డిసెంబర్ 13న – యుపి బ్రిజ్ స్టార్స్ vs ముంబై మెరైన్స్ (రాత్రి 7.30 గంటలకు)
డిసెంబర్ 14న – నార్తర్న్ ఛాలెంజర్స్ vs ముంబై మెరైన్స్ (మధ్యాహ్నం 3 గంటలకు)
డిసెంబర్ 14న – రాజస్థాన్ రీగల్ వర్సెస్ ఎంపీ టైగర్స్ (రాత్రి 7.30 గంటలకు)
డిసెంబర్ 15న – UP బ్రిజ్ స్టార్స్ vs MP టైగర్స్ (మధ్యాహ్నం 3 గంటలకు)
డిసెంబర్ 15న – ముంబై మెరైన్స్ vs రాజస్థాన్ రీగల్స్ (రాత్రి 7.30 గంటలకు)
డిసెంబర్ 16న – నార్తర్న్ ఛాలెంజర్స్ vs MP టైగర్స్ (మధ్యాహ్నం 3 గంటలకు)
డిసెంబర్ 16న – సదరన్ స్పార్టాన్స్ vs UP బ్రిజ్ స్టార్స్ (రాత్రి 7.30 గంటలకు)
డిసెంబర్ 17న – నార్తర్న్ ఛాలెంజర్స్ vs UP బ్రిజ్ స్టార్స్ (మధ్యాహ్నం 3 గంటలకు)
డిసెంబర్ 17న – సదరన్ స్పార్టాన్స్ vs ముంబై మెరైన్స్ (రాత్రి 7.30 గంటలకు)
డిసెంబర్ 18న – సదరన్ స్పార్టాన్స్ vs MP టైగర్స్ (మధ్యాహ్నం 3 గంటలకు)
డిసెంబర్ 18న – నార్తర్న్ ఛాలెంజర్స్ vs రాజస్థాన్ రీగల్స్ (రాత్రి 7.30 గంటలకు)
డిసెంబర్ 19న – UP బ్రిజ్ స్టార్స్ vs రాజస్థాన్ రీగల్స్ (మధ్యాహ్నం 3 గంటలకు)
డిసెంబర్ 19న – ముంబై మెరైన్స్ vs ఎంపీ టైగర్స్ (రాత్రి 7.30 గంటలకు)
డిసెంబర్ 21న – సెమీఫైనల్ 1 (మధ్యాహ్నం 3 గంటలకు)
డిసెంబర్ 21న – సెమీఫైనల్ 2 (రాత్రి 7.30 గంటలకు)
డిసెంబర్ 22 న – ఫైనల్ (రాత్రి 7.30 గంటలకు)