Big shock to Australia ahead of 1st ODI against India
IND vs AUS : భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం (అక్టోబర్ 19) నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. మరో రెండు రోజుల్లో పెర్త్ వేదికగా తొలి వన్డేలో భారత్‌తో తలపడాల్సి ఉండగా ఆసీస్ జట్టుకు (IND vs AUS) భారీ షాక్ తగిలింది.
నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా కామెరూన్ గ్రీన్ కి వెన్ను నొప్పి తిరగబెట్టింది. దీంతో భారత్‌తో వన్డే సిరీస్‌కు అతడిని సెలక్టర్లు పక్కన బెట్టారు. అతడి స్థానంలో మార్నస్ లబుషేన్‌ను ఆసీస్ సెలక్టర్లు ఎంపిక చేశారు.
Marnus Labushagne has been rewarded for his strong domestic form, but an Aussie star is set to miss the #AUSvIND series: https://t.co/AkmfSSiMHY pic.twitter.com/c2O7j0dMsL
— cricket.com.au (@cricketcomau) October 17, 2025
ఫిట్‌నెస్ సమస్యలు, వెన్నునొప్పి కారణంగా దాదాపు సంవత్సరం పాటు జట్టుకు దూరంగా ఉన్న కామెరూన్ గ్రీన్ ఈ ఏడాది ఆగస్టులో రీ ఎంట్రీ ఇచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌తో ఓ మోస్తరుగా రాణించాడు.ఆల్‌రౌండర్ అయిన గ్రీన్ రీ ఎంట్రీలో కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తున్నాడు.
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మళ్లీ బౌలింగ్ ప్రారంభించడానికి నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా అతడి వెన్ను గాయం మళ్లీ తిరగబెట్టినట్లు ఆసీస్ మీడియా తెలిపింది.
భారత్‌తో వన్డే సిరీస్‌కు నవీకరించిన ఆసీస్ జట్టు ఇదే..
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మాథ్యూ కుహ్నెమాన్, మార్నస్ లబుషేన్, మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్, మాథ్యూ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్
రెండో మ్యాచ్ నుంచి ఆడమ్ జంపా , అలెక్స్ కారీ , జోష్ ఇంగ్లిస్ లు కూడా స్క్వాడ్‌లో ఉంటారు.