Courtesy BCCI
ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించింది. రాజస్థాన్ విజయంలో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (101) కీలక పాత్ర పోషించాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసి ఐపీఎల్‌లో అత్యంత తక్కువ వయసులో శతకం చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఈ క్రమంలో అతడి పై ప్రశంసల వర్షం కురుస్తోంది. బీహార్‌కు చెందిన ఈ కుర్రాడిపై నగదు వర్షం కురిసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రూ.10 లక్షల ప్రైజ్‌మనీని సూర్య వంశీకి అందజేయనున్నట్లు ప్రకటించారు.
आई॰पी॰एल॰ के इतिहास में सबसे कम उम्र (14 साल) में शतक लगाने वाले खिलाड़ी बने बिहार के श्री वैभव सूर्यवंशी को बधाई एवं शुभकामनाएं। वे अपनी मेहनत और प्रतिभा के बलबूते भारतीय क्रिकेट की एक नई उम्मीद बन गए हैं। सभी को उन पर गर्व है। श्री वैभव सूर्यवंशी एवं उनके पिता जी से वर्ष 2024… pic.twitter.com/n3UmiqwTBX
— Nitish Kumar (@NitishKumar) April 29, 2025
Vaibhav Suryavanshi : ‘ఇది నాకో సాధారణ విషయం..’ వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు..
‘ఐపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా (14 సంవత్సరాలు) నిలిచిన బీహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీకి అభినందనలు, శుభాకాంక్షలు. అతని కృషి, ప్రతిభ ఫలితంగా అతను భారత క్రికెట్‌కు కొత్త ఆశాకిరణంగా మారాడు. అందరూ అతని పట్ల గర్వపడుతున్నారు. నేను 2024లో వైభవ్ సూర్యవంశీని, అతని తండ్రిని కలిశాను. ఆ సమయంలో.. నేను అతనికి ఉజ్వల భవిష్యత్తును కోరుకున్నాను. ఐపీఎల్‌లో అతని అద్భుతమైన ప్రదర్శన తర్వాత, నేను ఫోన్‌లో కూడా అతనిని అభినందించాను. బీహార్‌కు చెందిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల ప్రైజ్ మనీని కూడా ఇస్తుంది. వైభవ్ భవిష్యత్తులో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాలని, జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తున్నాను.’ అని నితీష్ కుమార్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కూడా 14 ఏళ్ల బాలుడి చిరస్మరణీయ ప్రదర్శనను ప్రశంసించారు.”పార్టీ తరపున నేను అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అతను ఒక యువ ప్రతిభావంతుడు. ఇంత చిన్న వయస్సులోనే అద్భుత ప్రయాణాన్ని ప్రారంభించాడు. అతడి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.” అని అన్నారు.
మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (84), జోస్ బట్లర్ (50 నాటౌట్) అర్థశతకాలు చేశారు. ఆతరువాత వైభవ్ సూర్యవంశీ (101; 38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్లు) విధ్వంసకర శతకానికి తోడు యశస్వి జైస్వాల్ (70; 40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో లక్ష్యాన్ని రాజస్థాన్ 15.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి అందుకుంది.