Rishabh Pant
Rishabh Pant Accident: టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్, బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా మధ్య కొద్ది నెలల క్రితం సోషల్ మీడియాలో వార్ జరిగిన విషయం విధితమే. ఓ ఇంటర్వ్యూలో క్రికెటర్ పంత్‌పై ఊర్వశి సంచలన ఆరోపణలు చేసింది. అయితే పంత్ వీటిని ఖండించారు. పంత్ ఫ్యాన్స్ సైతం ఊర్వశీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో కొంతకాలం సోషల్ మీడియాలో పంత్ వర్సెస్ ఊర్వశీ అన్నట్లుగా మాటల యుద్ధం కొనసాగింది.
Rishabh Pant Road Accident : రోడ్డు ప్రమాదంలో క్రికెటర్ రిషబ్ పంత్ కు తీవ్ర గాయాలు
ప్రస్తుతం క్రికెటర్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనకు డెహ్రాడూన్‌లోని మాక్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పంత్ ప్రమాద వార్త తెలియగానే ఆయన అభిమానులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. తాజాగా పంత్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. పంత్ నుదురు చిట్లినట్లు, వీపుపై కాలిన గాయాలు, కుడి మోకాలికి గాయమైనట్లు తెలిపింది. ప్రస్తుతం పంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని బీసీసీఐ వెల్లడించింది. ప్రధాని మోదీసైతం పంత్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. పలువురు క్రికెటర్లు, ప్రముఖులు పంత్ త్వరగా కోలుకోవాలని ట్వీట్లు చేస్తున్నారు.
Rishabh Pant : రిషబ్ పంత్ యాక్సిడెంట్ CCTV విజువల్స్..
తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటి ఊర్వశీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్టు చేసింది. దేవకన్య రూపంలో ఉన్న ఆమె ఫొటోను షేర్ చేస్తూ.. దానికి కింద ప్రార్థిస్తున్నాను అని పేర్కొంది. పంత్ పేరు ఎక్కడా ప్రస్తావించకుండా కేవలం ప్రార్థిస్తున్నాను అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టును షేర్ చేసింది. ఊర్వశీ పోస్ట్ పై పంత్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఊర్వశీని తమదైన శైలిలో పంత్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. భయ్యాజీ ఆసుపత్రిలో ఉన్నాడు.. మీరు హాట్ చిత్రాలు పోస్టు చేస్తున్నారు. ఎవరైనా తెల్లని దుస్తులు ధరించి ప్రార్థిస్తారు అంటూ ఓ నెటిజన్ పేర్కొన్నాడు. మరొకరు.. ప్రమాదం జరిగిన సమయంలో ఇలాంటి పోస్ట్ చేయడం మీరు సరికాదు అని పేర్కొన్నాడు. ఇలా పలు విధాలుగా పంత్ ఫ్యాన్స్ ఊర్వశిని ట్రోల్ చేస్తున్నారు.