Rishabh Pant Road Accident : రోడ్డు ప్రమాదంలో క్రికెటర్ రిషబ్ పంత్ కు తీవ్ర గాయాలు

భారత్ క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పంత్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఉత్తరాఖండ్ లోని రూర్కీ దగ్గర రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టింది.

Rishabh Pant Road Accident : రోడ్డు ప్రమాదంలో క్రికెటర్ రిషబ్ పంత్ కు తీవ్ర గాయాలు

Rishabh Pant

Updated On : December 30, 2022 / 1:48 PM IST

Rishabh Pant Road Accident : భారత్ క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పంత్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఉత్తరాఖండ్ లోని రూర్కీ దగ్గర రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఢీకొట్టిన తర్వాత కారులో తీవ్ర స్థాయిలో మంటలు చెలరేగాయి. కారులో నుంచి రిషబ్ పంత్ బయటికి దూకేశాడు.

దీంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పంత్ ఆస్పత్రిలో చికిత్స పొందున్నాడు. బీఎండబ్ల్యూ కారును స్వయంగా పంత్ నడుపుతున్నట్లు తెలిసింది.  ఇటీవలే బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో ఇండియా నెగ్గిన విషయం తెలిసిందే.

Modi’s Brother Injured: రోడ్డు ప్రమాదంలో ప్రధాని మోదీ సోదరుడు, కుటుంబ సభ్యులకు గాయాలు

ఆ జట్టులో పంత్ కూడా ఉన్నారు. ఆ సిరీస్ లో 46,93 రన్స్ స్కోర్ చేశారు. గత కొన్ని రోజుల క్రితం రిషబ్ పంత్ దుబాయ్ లో క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. కెప్టెన్ ధోనీ, అతని ఫ్యామిలీ తో పాటు పంత్ ఆ సెలబ్రేషన్ లో ఉన్నారు. ధోనీ భార్య సాక్షి ఆ ఫోటోలను షేర్ చేసింది.