Bowler And Batter Exchange Blows In Violent Clash On Cricket Pitch
క్రికెట్‌ను జెంటిల్ మ్యాన్ గేమ్ అని అంటారు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే కొందరు ఆటగాళ్ల వల్ల దీనికి మాయని మచ్చ వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఓ క్రికెట్ మ్యాచ్‌లో బ్యాటర్, బౌలర్ పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు. వీరికి కొందరు ప్లేయర్లు మద్దతు పలికారు. ఇంకేముంది.. క్రికెట్ గ్రౌండ్ కాస్త రణరంగంలా మారిపోయింది. అంపైర్లు ఆపేందుకు ప్రయత్నించినా ఒక్కడంటే ఒక్కడు మాటవినలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
MCC వీక్‌డేస్ బాష్ XIX ఫైనల్స్ మ్యాచ్‌లో ఇది చోటు చేసుకుంది. ఏరోవిసా క్రికెట్, రబ్దాన్ క్రికెట్ క్లబ్‌లు ఫైనల్ మ్యాచ్‌లో తలపడ్డాయి. రబ్దాన్ రెండో ఇన్నింగ్స్‌లో 13వ ఓవర్‌లో ఇది జరిగింది. ఈ ఓవర్‌లోని చివరి బంతికి రబ్దాన్ బ్యాటర్ కాషిఫ్ మహ్మద్ ప్యాడ్లకు బాల్ తాకింది. బౌలర్ నాసిర్ అలీ అప్పీల్ చేయడంతో అంపైర్ ఔట్ ఇచ్చాడు.
Rohit Sharma : ఆకాశ్ దీప్ వికెట్ తీసిన తరువాత.. రోహిత్ శర్మ ఎపిక్ రియాక్షన్ చూశారా? వైరల్
దీంతో నాసిర్ అలీ సంబరాలు చేసుకున్నాడు. ఔట్ కావడంతో మహ్మద్ డ్రెస్సింగ్ రూమ్ వైపు నడక ప్రారంభించాడు. అయితే.. బౌలర్ అలీ.. మహ్మద్ వైపు వెళ్లి అతడిని రెచ్చగొట్టేలా సంబురాలు చేసుకున్నాడు. పెవిలియన్‌కు వెళ్లవోయి అంటూ వేలు చూపించాడు. దీంతో బ్యాటర్ మహ్మద్ ఆగ్రహానికి లోనైయ్యాడు. ఈ క్రమంలో ఇరువురి ఆటగాళ్ల ఒకరినొకరు కొట్టుకుంటూ నేలపై పడిపోయారు.
అంపైర్లతో పాటు గ్రౌండ్‌లోని ఆటగాళ్లు వారిద్దరి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు. కొందరు వారిద్దరిని విడదీయడానికి ప్రయత్నించగా ఇంకొందరు అగ్నికి ఆజ్యం పోశారు. బ్యాట్‌తో ప్రత్యర్థులను కొట్టారు. వీరిని ఆపేందుకు అంపైర్లు ఎంతగా ప్రయత్నించినప్పటికి ఒక్కరంటే ఒక్కరు కూడా మాట వినలేదు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Shakib al Hasan : నీ కోరిక నెరవేర్చలేము.. బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్‌కు షాకిచ్చిన బీసీబీ
KALESH on Cricket Pitch 🥵 pic.twitter.com/mhvNYFIp4I
— Sameer Allana (@HitmanCricket) September 25, 2024