Rohit Sharma : ఆకాశ్ దీప్ వికెట్ తీసిన త‌రువాత.. రోహిత్ శ‌ర్మ ఎపిక్ రియాక్ష‌న్ చూశారా? వైర‌ల్‌

కాన్పూర్ వేదిక‌గా భార‌త్‌, బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య రెండో టెస్టు మ్యాచ్ జ‌రుగుతోంది.

Rohit Sharma : ఆకాశ్ దీప్ వికెట్ తీసిన త‌రువాత.. రోహిత్ శ‌ర్మ ఎపిక్ రియాక్ష‌న్ చూశారా? వైర‌ల్‌

Rohit Epic Reaction After DRS Call Results In Shadman Islam Wicket

Updated On : September 27, 2024 / 12:18 PM IST

కాన్పూర్ వేదిక‌గా భార‌త్‌, బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య రెండో టెస్టు మ్యాచ్ జ‌రుగుతోంది. టాస్ గెలిచిన భార‌త్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది. అయితే.. బంగ్లాకు యువ పేస‌ర్ ఆకాశ్ దీప్ డ‌బుల్ షాకిచ్చాడు. ఓపెన‌ర్లు ఇద్ద‌రిని పెవిలియ‌న్‌కు చేర్చాడు.

య‌శ‌స్వి జైస్వాల్ అద్భుత క్యాచ్ అందుకోవ‌డంతో మొద‌ట జాకీర్ హ‌స‌న్‌ను ఔట్ చేసిన ఆకాశ్‌.. ఆ త‌రువాత షాద్మాన్ ఇస్లాంను ఎల్బీడ‌బ్ల్యూగా ఔట్ చేశాడు. ఇందులో జాకీర్ హ‌స‌న్ 24 బంతులు ఆడి డ‌కౌట్ కాగా.. ష‌ద్మాన్ 24 ప‌రుగులు చేశాడు.

KKR mentor : కేకేఆర్‌కు కొత్త మెంటార్ వ‌చ్చేశాడు.. గౌతీ స్థానంలో సీఎస్‌కే మాజీ ఆట‌గాడు..

ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో బంతి ష‌ద్మాన్ ప్యాడ్ల‌కు తాకింది. ఎల్బీడ‌బ్ల్యూ అంటూ ఆకాశ్ అప్పీల్ చేయ‌గా ఆన్‌ఫీల్డ్ అంపైర్ నాటౌట్ అని అన్నాడు. వెంట‌నే ఆకాశ్ త‌న నిర్ణ‌యం క‌రెక్ట్ అని రోహిత్‌కు చాలా న‌మ్మ‌కంగా చెప్పాడు. రివ్వ్యూ తీసుకోవాల‌ని కోరాడు. అయితే.. రోహిత్ కాస్త సందేహించాడు. వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌తో మాట్లాడాడు. బంతి బౌన్స్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని వికెట్ల‌ను తాక‌పోవ‌చ్చున‌ని పంత్‌ అన్నాడు. అయితే.. అది ఖ‌చ్చితంగా ఔట్ అని ఆకాశ్ న‌మ్మ‌కంగా చెబుతుండ‌డంతో రోహిత్ శ‌ర్మ రివ్య్వూ తీసుకున్నాడు.

ఇక రివ్య్వూలో బంతి లెగ్ సైడ్ వికెట్ల‌ను తాకుతున్న‌ట్లు క‌నిపించాడు. దీంతో అంపైర్ త‌న నిర్ణ‌యాన్ని మార్చుకుంటూ ఔట్ ఇచ్చాడు. రిప్లేని మైదానంలోని స్కీన్ పై చూస్తున్న రోహిత్ శ‌ర్మ మూడు రెడ్లులు రావ‌డంతో ఇచ్చిన ఎక్స్‌ప్రెష‌న్‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

IND vs BAN : అభిమానులు జ‌ర జాగ్ర‌త్త‌..! పంత్ సిక్స‌ర్‌తో డేంజ‌ర్‌?

ప్ర‌స్తుతం 13 ఓవ‌ర్ల‌కు బంగ్లాదేశ్ స్కోర్‌ 37/2. మోమినుల్ హక్ (0), నజ్ముల్ హొస్సేన్ శాంటో (8) లు క్రీజులో ఉన్నారు.