IND vs BAN : అభిమానులు జర జాగ్రత్త..! పంత్ సిక్సర్‌తో డేంజర్?
కాన్పూర్ స్టేడియంలోని పరిస్థితులకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

India vs Bangladesh 2nd Test Stand Deemed Unsafe May Collapse Report
India vs Bangladesh : బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భారత్ భావిస్తోంది. ఇప్పటికే తొలి టెస్టులో భారత్ 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక రెండో టెస్టు మ్యాచ్ శుక్రవారం కాన్పూర్ వేదికగా జరగనుంది. అయితే.. ఈ స్టేడియంలోని పరిస్థితులకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టేడియంలోని ఓ స్టాండ్ చాలా బలహీనంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇందుకు సంబంధించి ఉత్తరప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ఓ నివేదిక కూడా ఇచ్చినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకవేళ పూర్తి సామర్థ్యంతో అభిమానులు ఆ స్టాండ్‌లో గనుక నిండితే కుప్పకూలే ప్రమాదం ఉన్నట్లు అధికారులు తెలిపినట్లు సదరు కథనాల సారాంశం. దీంతో ఆ స్టాండ్‌లో సగం టికెట్లు మాత్రమే విక్రయించాలని యూపీ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుందట.
Virat Kohli : బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు.. సచిన్ రికార్డు పై కన్నేసిన కోహ్లీ.. ఈ రికార్డు కూడా..
సి-స్టాండ్ బాల్కనీ ఎక్కువ మంది ఫ్యాన్స్ బరువు ఆపదని పీడబ్ల్యూడీ తెలిపినట్లు యూపీ క్రికెట్ సంఘం సీఈఓ అంకిత్ ఛటర్జీ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. స్టాండ్ కెపాసిటి 4800 కాగా.. అందులో 1700 టికెట్లను మాత్రమే అమ్మాలని సూచించింది. ఇందుకు తాము అంగీకరించినట్లు చెప్పాడు.
రిషబ్ పంత్ లేదా మరే భారత బ్యాటర్ అయిన సిక్సర్లు కొడితే అప్పుడు 50 మంది అభిమానులు ఆనందంలో కేరింతలు కొడుతూ ఒక్కసారిగా ఎగిరితే స్టాండ్ బరువును ఆపలేదని పీడబ్ల్యూటీ ఇంజినీర్లు చెప్పినట్లు తెలిపాడు. ఈ భాగానికి మరమ్మతులు అవసరం అని అన్నారు. ఆ పనులు కొనసాగుతున్నాయన్నారు.
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. తొలి మూడు రోజులు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది.