Virat Kohli : బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు.. సచిన్ రికార్డు పై కన్నేసిన కోహ్లీ.. ఈ రికార్డు కూడా..
ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ ఒకరు.

Virat Kohli needs 35 runs to become only the 4th batter in history to complete 27000 runs in international cricket
Virat Kohli – Sachin Tendulkar : ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ ఒకరు. ఇప్పటికే ఎన్నో రికార్డులను బ్రేక్ చేశాడు. వన్డేల్లో 50 శతకాలు చేసిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇక తాజాగా బంగ్లాదేశ్‌తో కాన్ఫూర్ వేదికగా జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు విరాట్‌ను ఓ రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో గనుక కోహ్లీ 35 పరుగులు చేస్తే అరుదైన జాబితాలో అడుగుపెట్టనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 27 వేల పరుగుల మైలురాయిని కోహ్లీని అందుకోనున్నాడు.
ఈ ఘనతను ఇప్పటి వరకు ముగ్గురు సాధించగా కోహ్లీ నాలుగో ఆటగాడిగా నిలవనున్నాడు. అంతేకాదండోయ్ అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలవనున్నాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 623 ఇన్నింగ్స్ (226 టెస్టు ఇన్నింగ్స్‌లు, 396 వన్డే ఇన్నింగ్స్‌లు, 1టీ20 ఇన్నింగ్స్)లో ఈ ఘనత సాధించాడు. కోహ్లీ ఇప్పటి వరకు 593 ఇన్నింగ్స్‌ల్లో 26,975 పరుగులు చేశాడు.
Virat Kohli : కోహ్లీకి ఏమైంది? 15 బంతుల్లో నాలుగు సార్లు ఔట్.. బంగ్లాతో రెండో టెస్టులో రాణించేనా?
ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ఉన్నారు. టెండూల్కర్ తన కెరీర్‌లో 34,357 పరుగులు చేశాడు. ఆ తరువాత కుమార సంగక్కర, రికీ పాంటింగ్‌లు ఉన్నారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..
సచిన్ టెండూల్కర్ – 34,357 పరుగులు
కుమార సంగక్కర – 28,016 పరుగులు
రికీ పాంటింగ్ – 27,483 పరుగులు
విరాట్ కోహ్లీ – 26,965 పరుగులు
మహేలా జయవర్ధనే – 25, 957 పరుగులు
జాక్వెస్ కలిస్ – 25,534 పరుగులు