KKR mentor : కేకేఆర్‌కు కొత్త మెంటార్ వచ్చేశాడు.. గౌతీ స్థానంలో సీఎస్‌కే మాజీ ఆటగాడు..
ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కొత్త మెంటార్ వచ్చేశాడు.

Kolkata Knight Riders Announce Gautam Gambhirs Replacement
KKR mentor : ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కొత్త మెంటార్ వచ్చేశాడు. టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ వెళ్లిపోవడంతో కేకేఆర్ మెంటార్ పోస్ట్ ఖాళీ అయింది. గౌతీ స్థానంలో వెస్టిండీస్ మాజీ ఆటగాడు డ్వేన్ బ్రావో వచ్చాడు. ఈ విషయాన్ని కేకేఆర్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ” ‘సర్ ఛాంపియన్’ బ్రావోకు హాలో చెప్పండి. ఛాంపియన్ సిటీకి స్వాగతిస్తున్నాము.” అని ట్వీట్ చేసింది.
‘బ్రావో మా జట్టులో చేరడం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. అతడు ఏ జట్టుకు ఆడినా సరే గెలవాలనే తపనతోనే ఆడుతుంటాడు. అతడి అనుభవం, జ్ఞానం ఫ్రాంచైజీ, ఆటగాళ్లకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. అతడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా ఫ్రాంచైజీలన్నింటితో CPL, MLC, ILT20 లీగుల్లో ఆడినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము.’ అని కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఐపీఎల్‌లో ఎప్పుడూ కూడా బ్రావో కేకేఆర్ తరుపున ఆడలేదు. చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అయితే.. కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో అతడు కేకేఆర్ ఫ్రాంచైజీకి చెందిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరుపున ఆడాడు. 2013 నుంచి 2020 వరకు ట్రిన్‌బాగోకు నైట్‌రైడర్స్‌కు బ్రావో కెప్టెన్‌గా వ్యవహరించడం గమనార్హం.
ఇక కేకేఆర్ మెంటార్‌గా రావడం పై బ్రావో స్పందించాడు. “సీఎల్‌లో గత 10 సంవత్సరాలుగా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరుపున ఆడాను. అంతేకాదు లీగుల్లో నైట్‌రైడర్స్ తరుపున, వ్యతిరేకంగా ఆడాను. దీంతో వారు ఎలా పని చేస్తారనే దానిపై నాకు ఓ అవగాహన ఉంది. యజమానుల అభిరుచి, మేనేమ్‌మెంట్ వృత్తి నైపుణం, కుటుంబ వాతావరణంలా ఉండే డ్రెస్సింగ్ రూమ్‌లను చూశాను. కోచ్‌గా నాకు ఇది సరైన వేదిక.” అని బ్రావో అన్నాడు.
Shakib al Hasan : నీ కోరిక నెరవేర్చలేము.. బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్‌కు షాకిచ్చిన బీసీబీ
2021లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు డ్వేన్ బ్రావో వీడ్కోలు పలికాడు. అప్పటి నుంచి కేవలం లీగుల్లో మాత్రమే ఆడుతున్నాడు. తాజాగా అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. అతడు ఈ విషయాన్ని ప్రకటించిన కాసేపటికే కేకేఆర్ తమ మెంటార్‌గా నియమించినట్లు వెల్లడించడం గమనార్హం.
Say hello to our new Mentor, DJ ‘sir champion’ Bravo! 💜
Welcome to the City of Champions! 🎶🏆 pic.twitter.com/Kq03t4J4ia
— KolkataKnightRiders (@KKRiders) September 27, 2024