Dwayne Bravo: క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వెస్టిండీస్ స్టార్ ప్లేయర్.. కారణం అదేనా?

వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 40ఏళ్ల బ్రావో తన చివరి కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) సీజన్లో ..

Dwayne Bravo: క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వెస్టిండీస్ స్టార్ ప్లేయర్.. కారణం అదేనా?

Dwayne Bravo

Updated On : September 27, 2024 / 9:57 AM IST

Dwayne Bravo Announces Retirement From Cricket : వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. 40ఏళ్ల బ్రావో తన చివరి కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) సీజన్లో గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. తన 21ఏళ్ల క్రికెట్ కెరీర్ లో టీ20 క్రికెట్ లో అత్యంత ప్రసిద్ధ ఆటగాళ్లలో ఒకడిగా పేరుగడించాడు. 2021లో అంతర్జాతీయ క్రికెట్ కు, గత ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి రిటైర్ అయిన బ్రావో.. ఇటీవల ప్రాంచైజీ క్రికెట్, కోచింగ్ గా పనిచేసేందుకు దృష్టిసారించాడు. బ్రావో ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ప్రాతినిధ్యం వహించాడు.

Also Read : Shakib al Hasan : నీ కోరిక నెరవేర్చలేము.. బంగ్లాదేశ్ క్రికెటర్ ష‌కీబ్‌కు షాకిచ్చిన బీసీబీ

బ్రావో తన ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొన్న వివరాల ప్రకారం.. 21 సంవత్సరాల ప్రొఫెషనల్ క్రికెటర్ గా నా ప్రయాణం ఎత్తుపల్లాల మధ్య సాగింది. నాకు అన్నీ అందించిన ఆటకు ఈరోజు నేను వీడ్కోలు పలుకుతున్నాను. భారమైన హృదయంతో, ఈ క్రీడ నుండి నా రిటైర్మెంట్‌ని అధికారికంగా ప్రకటిస్తున్నానని బ్రావో అన్నారు. కొన్ని సంవత్సరాలుగా నా అభిమానులు నాపై కురిపించిన ప్రేమకు నేను భారీ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. కరేబియన్, ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా ట్రినిడాడ్ & టొబాగోలో ఉన్న నా అభిమానులందరికీ నాకు ఇన్నాళ్లు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు అంటూ బ్రావో తెలిపాడు.

Also Read : IND vs BAN : అభిమానులు జ‌ర జాగ్ర‌త్త‌..! పంత్ సిక్స‌ర్‌తో డేంజ‌ర్‌?

ట్రినిడాడ్ లో జన్మించిన బ్రావో.. 582 మ్యాచ్ లలో 631 వికెట్లతో టీ20 చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రిటైర్ అయ్యాడు. అతని కెరీర్ లో ఐపీఎల్, పాకిస్థాన్ సూపర్ లీగ్, బిగ్ బాష్ లీగ్ లలో బహుళ టైటిళ్లను గెలుచుకోవడంతోపాటు జాతీయ జట్టుతో రెండు టీ20 ప్రపంచ కప్ విజయాలు ఉన్నాయి. 2021లోనే అంతర్జాతీయ క్రికెట్ను వదిలిపెట్టిన బ్రావో.. ఆ తరువాత లీగుల్లో మాత్రమే ఆడుతూ వచ్చాడు. గత సంవత్సరం ఐపీఎల్ నుండి వైదొలిగిన బ్రావో… ఆ తరువాత చెన్నై సూపర్ కింగ్స్, ఆఫ్గానిస్తాన్ జట్లకు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. ఇకనుంచి కోచింగ్ కెరీర్ పై దృష్టి పెడతానని ఓ ప్రకటనలో బావ్రో వెల్లడించాడు.