×
Ad

Jasprit Bumrah : క‌పిల్‌దేవ్‌, ఇషాంత్ శ‌ర్మ‌, ష‌మీల రికార్డులు బ్రేక్‌.. కానీ.. ఆ ఒక్క‌డిని అధిగ‌మించ‌లేక‌పోయిన బుమ్రా..

టీమ్ఇండియా పేస‌ర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Bumrah became the joint fastest India pacer by innings to reach 50 wickets at home

Jasprit Bumrah : టీమ్ఇండియా పేస్ గుర్రం జ‌స్‌ప్రీత్ బుమ్రా అరుదైన ఘ‌న‌త సాధించాడు. స్వ‌దేశంలో టెస్టుల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన భారత బౌల‌ర్ల జాబితాలో చోటు ద‌క్కించుకున్నాడు. ఈ క్ర‌మంలో అత‌డు క‌పిల్ దేవ్‌, ఇషాంత్ శ‌ర్మ‌, ష‌మీల‌ను అధిగ‌మించి జ‌వ‌గ‌ల్ శ్రీనాథ్‌తో క‌లిసి అగ్ర‌స్థానంలో నిలిచాడు.

గురువారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా వెస్టిండీస్‌తో ప్రారంభ‌మైన తొలి టెస్టు మ్యాచ్‌లో మొద‌టి ఇన్నింగ్స్‌ల్లో మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌డం ద్వారా అత‌డు ఈ ఘ‌న‌త అందుకున్నాడు. జ‌వ‌గ‌ల్ శ్రీనాథ్, బుమ్రా (Jasprit Bumrah)లు ఇద్ద‌రూ కూడా భార‌త దేశంలో టెస్టుల్లో 24 ఇన్నింగ్స్‌ల్లోనే 50 వికెట్లు ప‌డ‌గొట్టారు. వీరిద్ద‌రి త‌రువాత స్థానాల్లో కపిల్‌ దేవ్‌, ఇషాంత్‌ శర్మ , షమీ లు ఉన్నారు.

Vaibhav Suryavanshi : ఏందీ ఆ కొట్టుడు సామీ.. వైభ‌వ్ సూర్య‌వంశీ విధ్వంసం.. 9 ఫోర్లు, 8 సిక్స‌ర్లు.. వ‌ర‌ల్డ్ రికార్డు..

స్వదేశంలో టెస్టుల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్లు..

* జ‌వ‌గ‌ల్ శ్రీనాథ్ – 24 ఇన్నింగ్స్‌ల్లో
* జ‌స్‌ప్రీత్ బుమ్రా – 24 ఇన్నింగ్స్‌ల్లో
* క‌పిల్ దేవ్ – 25 ఇన్నింగ్స్‌ల్లో
* ఇషాంత్ శ‌ర్మ – 27 ఇన్నింగ్స్‌ల్లో
* మ‌హ్మ‌ద్ ష‌మీ – 27 ఇన్నింగ్స్‌ల్లో

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. భార‌త బౌల‌ర్ల ధాటికి మొద‌టి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 162 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. జస్టిన్ గ్రీవ్స్ (32), షై హోప్ (26), రోస్ట‌న్ ఛేజ్ (24) ప‌ర్వాలేద‌నిపించారు. టీమ్ఇండియా బౌల‌ర్ల‌లో సిరాజ్ నాలుగు వికెట్లు తీశాడు. బుమ్రా మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. కుల్దీప్ యాద‌వ్ రెండు వికెట్లు తీయ‌గా, వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఓ వికెట్ సాధించాడు.

Deepti Sharma : చరిత్ర సృష్టించిన దీప్తి శ‌ర్మ‌.. ఒకే ఒక భార‌త మ‌హిళా క్రికెట‌ర్‌..

ఆ త‌రువాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భార‌త్ 45 ఓవ‌ర్లు ముగిసే స‌రికి రెండు వికెట్లు కోల్పోయి 142 ప‌రుగులు చేసింది. కేఎల్ రాహుల్ (64), శుభ్‌మ‌న్ గిల్ (24)లు క్రీజులో ఉన్నారు. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు భార‌త్ ఇంకా 20 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది.