Jasprit Bumrah- Sanjana Ganesan
టీ20 ప్రపంచకప్‌లో మరోసారి పాకిస్తాన్‌ను భారత్ మట్టి కరిపించింది. ఆదివారం న్యూయార్క్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాక్ పై భారత్ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత జట్టు విజయం సాధించడంలో టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.
కాగా.. మ్యాచ్ అనంతరం బుమ్రాను అతడి భార్య, టీవీ ప్రజెంటర్ సంజనా గణేషన్ ఇంటర్వ్యూ చేసింది. బుమ్రా మాట్లాడుతూ.. పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లుగా బౌలింగ్ చేసి మంచి ఫలితాన్ని రాబట్టినట్లు చెప్పాడు. కాగా.. పాక్ ఇన్నింగ్స్ ఆరంభంలో తాము విధించిన లక్ష్యం సరిపోదని భావించినట్లు తెలిపాడు. సూర్యుడి రాకతో పిచ్ మెరుగుఅవ్వడంతో విజయం సాధించడం కష్టమని భావించినట్లు చెప్పాడు. అయినప్పటికీ క్రమ శిక్షణతో బౌలింగ్ చేసి మంచి ఫలితాన్ని రాబట్టాం. నా బౌలింగ్ ప్రదర్శన నాకు సంతృప్తినిచ్చింది అని అన్నాడు. ఇదే జోరును కొనసాగించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించాడు.
South Africa : చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. టీమ్ఇండియా రికార్డు కనుమరుగు..
ఇంటర్వ్యూ ముగిసిన తరువాత బుమ్రాకు సంజన శుభాకాంక్షలు తెలియజేసింది. త్వరలోనే మళ్లీ కలుద్దాం అని చెప్పింది. వెంటనే బుమ్రా.. నేను మిమ్మల్ని 30 నిమిషాల తరువాత మళ్లీ కలుస్తాను అని అన్నాడు. దీంతో డిన్నర్ ఏక్కడ అంటూ సంజన అడిగింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జస్ప్రీత్ బుమ్రా-సంజనా గణేశన్ 2013 ఐపీఎల్ సమయంలో మొదటిసారి కలుసుకున్నారు. 15 మార్చి 2021న వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు అంగద్ జస్ప్రీత్ బుమ్రా అనే కొడుకు ఉన్నాడు.
SA vs BAN : సౌతాఫ్రికా సేఫ్.. టెన్షన్ పెట్టిన బంగ్లా పులులు..