Pv Sindhu India
BWF World Championships 2021 : ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో భారత స్టార్స్ దూసుకపోతున్నారు. తెలుగు తేజం సింధు విజయంతో ప్రారంభించింది. తొలి రౌండ్ లో బై పొందిన సింధు…మంగళవారంతో జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ లో 21-7, 21-9తో మార్టినా రెపిస్కా పై అలవోకగా గెలుపొందారు. ఈ మ్యాచ్ కేవలం 24 నిమిషాల్లో ముగియడం విశేషం. 72వ ర్యాంక్‌లో ఉన్న రెపిస్కా కేవలం 16 పాయింట్లు మాత్రమే సాధించారు. తొలి గేమ్ లో స్కోర్…5-4 వద్ద సింధు మ్యాచ్ లో విజృంభించి ఆడారు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 10వ ర్యాంకర్ చోచువోంగ్ సింధు ఆడనుంది.
Read More : Bollywood : కరణ్ జోహార్ పార్టీతో బాలీవుడ్‌లో కరోనా కలకలం
మరోవైపు..ప్రపంచ మాజీ నంబర్ వన్ కిడాంబి శ్రీకాంత్ ప్రీక్వార్టర్ ఫైనల్ లో చోటు సంపాదించారు. ఈయనతో పాటు…లక్ష్య సేన్ కూడా విజయం సాధించారు. శ్రీకాంత్ – లీ షి ఫెంగ్ మధ్య పోటీ జరిగింది. 15–21, 21–18, 21–17తో శ్రీకాంత్ గెలుపొందారు. నిర్ణాయక మూడో గేమ్ లో శ్రీకాంత్ 10-13తో వెనుకబడినా..మళ్లీ విజృంభించాడు. వరుసగా ఆరు పాయింట్లు గెలిచి…16-13 అధిక్యంలో దూసుకొచ్చాడు. అనంతరం అదే దూకుడుని కొనసాగిస్తూ…ముందుకు దూసుకెళ్లాడు. 19వ ర్యాంకర్ లక్ష్య సేన్ – కెంటా నిషిమోటో తలపడ్డారు. 22–20, 15–21, 21–18తో లక్ష్య సేన్ విజయం సాధించాడు. గురువారం ప్రిక్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ జరగనుంది. లూ గ్వాంగ్ జు తో శ్రీకాంత్ తలపడ్డనున్నారు.