చరిత్ర సృష్టించింది : ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ విజేతగా పీవీ సింధు

  • Published By: venkaiahnaidu ,Published On : August 25, 2019 / 12:45 PM IST
చరిత్ర సృష్టించింది : ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ విజేతగా పీవీ సింధు

Updated On : August 25, 2019 / 12:45 PM IST

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ విజేతగా సింధు గెలిచింది. 40ఏళ్ల భారత్ కలను నిజం చేసింది. మూడోసారి టైటిల్ గెలిచిన తెలుగు తేజంగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో వరల్డ్‌ ఐదో ర్యాంకర్‌ సింధు.. ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ నొజోమి ఒకుహారా (జపాన్‌)పై గెలిచి జగజ్గేతగా అవతరించారు. వరుస సెట్లలో అలవోకగా  సాగిన ఫైనల్ లో 21-7,21-7తో ఒకుహరా(జపాన్)పై సింధు గెలిచింది. తొలి నుంచి ఒకుహరా అంచనాలకు అందకుండా సింధు ఏకపక్షంగా ఆటను కొనసాగించారు. అద్భుతమైన స్మాష్‌లతో పాటు అంతకుమించి సొగసైన రిటర్న్‌ షాట్లతో సింధు అలరించారు.

గతంలో రెండుసార్లు ఫైనల్లో ఓడిన సింధు మూడోసారి టైటిల్ గెలిచింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో సింధు స్వర్ణం కల సాకారమైంది. టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలుగా పీవీ సింధు రికార్డు సృష్టించింది.

2017 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఒకుహారాతో జరిగిన ఫైనల్‌ పోరులో ఓటమి పాలైన సింధు అందుకు ప్రతీకారం తీర్చుకున్నారు. ఈ గెలుపుతో ఒకుహారా లెక్కను సరిచేశారు. ఎలాగైన స్వర్ణం సాధించాలనే కసితో సింధు ఆట తీరు సాగింది. మరొకవైపు ఫైనల్‌ ఫోబియాకు చెక్‌ పెట్టాలనే ఏకైక లక్ష్యమే సింధుకు స్వర్ణాన్ని తెచ్చిపెట్టింది.