Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. అవును ఇది నిజం. మీరు నమ్మడం లేదా? అదేంటి ఆర్‌సీబీ ఫైనల్ లో చోటు సంపాదించింది గానీ.. ఇంకా ఫైనల్ మ్యాచ్ జరగలేదు. ఫైనల్‌లో ఆర్‌సీబీతో తలపడే జట్టు ఏదో ఇంకా తేలలేదు? అయినా ఆర్‌సీబీ గెలవడం ఏంటి మీకు గానీ మతి ఏమన్నా పోయిందా అని అంటారా? అక్కడికే వస్తున్నాం ఆగండి. ఈ విషయాన్ని చెబుతున్నది మేము కాదు.. దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్.
“మీరు నమ్మగలరా? ఆర్‌సీబీ ఐపీఎల్ గెలిచింది.” అంటూ సోషల్ మీడియాలో డేల్ స్టెయిన్ రాసుకొచ్చాడు. దీన్ని చూసిన ఆర్‌సీబీ ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోతున్నాయి. డేల్ స్టెయిన్ జోస్యం నిజం కావాలని కోరుకుంటున్నారు. తొలి క్వాలిఫయర్-1లో పంజాబ్ జట్టును ఓడించి ఆర్‌సీబీ ఫైనల్ చేరుకున్న వెంటనే ఈ మాజీ ఆర్‌సీబీ ఆటగాడు.. తమ జట్టుదే టైటిల్ అని నమ్మకంగా చెబుతున్నాడు.
GT vs MI : గుజరాత్‌తో ఎలిమినేటర్ మ్యాచ్.. రెండు భారీ రికార్డులు సాధించిన రోహిత్ శర్మ..
Can you believe it?!?!?!
RCB have won the IPL— Dale Steyn (@DaleSteyn62) May 30, 2025
ఇన్నాళ్లుగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఐపీఎల్ టైటిల్‌ను ఆర్‌సీబీ అందుకుంటుందా? డేల్ స్టెయిన్ జోస్యం నిజం అవుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
కాగా.. దీనిపై కొందరు నెటిజన్లు డేల్ స్టెయిన్ పై విమర్శలు చేస్తున్నారు. ఏప్రిల్ 17న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్‌లో 300 పరుగులు సాధిస్తుందని అతడు అంచనా వేశాడని, అది తప్పు అని తేలినట్లుగా గుర్తు చేస్తున్నారు.
Special forces are here 😭 pic.twitter.com/0mYfjZXR71
— Dhillon (@sehajdhillon_) May 30, 2025
ఇదిలా ఉంటే.. ఈ దక్షిణాఫ్రికా మాజీ పేసర్ ఐపీఎల్ లో ఆర్‌సీబీ తరుపున కొన్నాళ్ల పాటు ఆడాడు. మొత్తంగా 95 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అతడు 97 వికెట్లు తీశాడు.
GT vs MI : అందువల్లే మేం ఓడిపోయాం.. లేదంటేనా.. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు..
ఈ సీజన్‌లో ఆర్‌సీబీ అదరగొడుతోంది. రజత్ పాటిదార్ నాయకత్వంలో ఫైనల్‌కు దూసుకువెళ్లింది. లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో తొమ్మిది మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. 19 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలించింది. క్వాలిఫయర్ -1లో పంజాబ్ ను ఓడించి ఫైనల్ కు చేరుకుంది.
జూన్ 3 అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.