GT vs MI : గుజరాత్‌తో ఎలిమినేటర్ మ్యాచ్.. రెండు భారీ రికార్డులు సాధించిన రోహిత్ శర్మ..
ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.

Courtesy BCCI
ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 300 సిక్సర్లు బాదిన తొలి భారతీయ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. శుక్రవారం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో సిక్స్ బాది హిట్‌మ్యాన్ ఈ ఘనత సాధించాడు.
ఇక ఓవరాల్‌గా ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో క్రిస్‌గేల్ 357 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. వీరిద్దరి తరువాత కోహ్లీ, ధోని, డివిలియర్స్ లు ఉన్నారు.
GT vs MI : హార్దిక్ పాండ్యా హ్యాండ్‌షేక్‌ను శుభ్‌మన్ గిల్ పట్టించుకోలేదా? మండిపడుతున్న అభిమానులు
ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు వీరే..
క్రిస్ గేల్ – 357 సిక్సర్లు
రోహిత్ శర్మ – 302 సిక్సర్లు
విరాట్ కోహ్లీ – 291 సిక్సర్లు
ఎంఎస్ ధోని – 264 సిక్సర్లు
ఏబీ డివిలియర్స్ – 251 సిక్సర్లు
7000 IPL runs ✅
300 IPL sixes ✅
A clutch fifty in the Eliminator ✅@ImRo45 powers past two massive milestones in #TATAIPL & looks unstoppable in this high-stakes clash! 🔥LIVE NOW ➡ https://t.co/ratPT4LZKS#IPLPlayoffs | Eliminator 👉 #GTvMI on Star Sports Network &… pic.twitter.com/DgvJwfR1Oj
— Star Sports (@StarSportsIndia) May 30, 2025
ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మకు ఆరంభంలోనే రెండు లైఫ్స్ లభించాయి. ప్రసిద్ద్ కృష్ణ వేసిన రెండో ఓవర్‌లో రోహిత్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను గెరాల్డ్ కోయిట్జీ మిస్ చేశాడు. అప్పుడు హిట్‌మ్యాన్ స్కోరు 4 పరుగులు మాత్రమే. ఆ మరుసటి ఓవర్‌లో సిరాజ్ బౌలింగ్‌లో రోహిత్ ఇచ్చిన సులువైన క్యాచ్ వికెట్ కీపర్ కుశాల్ మెండీస్ వదిలివేశాడు. అప్పటికి హిట్‌మ్యాన్ స్కోరు 12 పరుగులు మాత్రమే.
GT vs MI : అందువల్లే మేం ఓడిపోయాం.. లేదంటనే.. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు..
ఈ రెండు అవకాశాలను సద్వినియోగం చేసుకున్న రోహిత్ శర్మ చెలరేగి ఆడాడు. 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో 7వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇక ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో రెండో స్థానానికి చేరుకున్నాడు. 8618 పరుగులతో కోహ్లీ ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు.
ఓవరాల్‌గా గుజరాత్‌తో మ్యాచ్‌లో 50 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 81 పరుగులు చేశాడు.
ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
విరాట్ కోహ్లీ – 8618 రన్స్
రోహిత్ శర్మ – 7038 రన్స్
శిఖర్ ధావన్ – 6769 రన్స్
డేవిడ్ వార్నర్ – 6565 రన్స్
సురేశ్ రైనా – 5528 రన్స్
ఎంఎస్ ధోని – 5439 రన్స్
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. గుజరాత్ పై విజయం సాధించిన ముంబై క్వాలిఫయర్ 2కి అర్హత సాధించింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు జూన్ 3న జరిగే ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో కప్పు కోసం పోటీపడనుంది.