SRH : 6 ఏళ్ల త‌రువాత ఫైన‌ల్‌కు చేరిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌.. క‌మిన్స్ అరుదైన రికార్డు..

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు అద‌ర‌గొట్టింది.

SunRisers Hyderabad : స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు అద‌ర‌గొట్టింది. చెపాక్ వేదిక‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్ 2 మ్యాచ్‌లో 36 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఈ విజ‌యంతో ఫైన‌ల్‌కు దూసుకువెళ్లింది. కాగా.. స‌న్‌రైజ‌ర్స్ ఆరేళ్ల‌ త‌రువాత ఫైన‌ల్‌కు చేరుకోవ‌డం ఇదే తొలిసారి. 2016లో డేవిడ్ వార్న‌ర్ సార‌థ్యంలో స‌న్‌రైజ‌ర్స్ క‌ప్పు కొట్ట‌గా.. 2018లో ఫైన‌ల్ మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓడిపోయింది. ఇక ఆదివారం కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

ఈ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో తొమ్మిది వికెట్ల న‌ష్టానికి 175 ప‌రుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (50; 34 బంతుల్లో 4 ఫోర్లు) హాఫ్ సెంచ‌రీ చేశాడు. రాహుల్ త్రిపాఠి (37; 12 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్స‌ర్లు) రాణిచాడు. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో అవేశ్ ఖాన్‌, ట్రెంట్ బౌల్ట్ చెరో మూడు వికెట్లు తీశారు. సందీప్ శ‌ర్మ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

Ambati Rayudu : ఆర్‌సీబీ పై అంబ‌టి రాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. వ్య‌క్తిగ‌త మైలురాళ్ల వ‌ల్ల‌నే..

అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌డ‌బ‌డింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి 139 పరుగుల‌కే ప‌రిమిత‌మైంది. ధ్రువ్ జురెల్ (56నాటౌట్; 35 బంతుల్లో 7 ఫోర్లు, 2సిక్స‌ర్లు), య‌శ‌స్వి జైస్వాల్ (42; 21బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) మెరుపులు మెరిపించిన‌ప్ప‌టికీ మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో ఓట‌మి త‌ప్ప‌లేదు. హైద‌రాబాద్ బౌల‌ర్ల‌లో షాబాద్ మూడు, అభిషేక్ శ‌ర్మ రెండు వికెట్లు తీశారు. పాట్ క‌మిన్స్‌, న‌ట‌రాజ‌న్‌లు చెరో వికెట్ సాధించారు.

క‌మిన్స్ అరుదైన ఘ‌న‌త..

హైద‌రాబాద్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఓ ఐపీఎల్ సీజ‌న్‌లో అత్య‌ధిక వికెట్లు సాధించిన రెండో కెప్టెన్‌గా క‌మిన్స్ చ‌రిత్ర సృష్టించాడు. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు క‌మిన్స్ 17 వికెట్లు తీశాడు. కాగా.. ఈ జాబితాలో షేన్‌వార్న్ తొలి స్థానంలో ఉన్నాడు. 2008 సీజ‌న్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్‌గా ఉన్న షేన్ వార్న‌ర్‌ 19 వికెట్లు ప‌డ‌గొట్టాడు. వీరిద్ద‌రి త‌రువాత అనిల్ కుంబ్లే ఉన్నాడు.

USA v BAN : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు బంగ్లాదేశ్ ప‌రువు పాయె..! స‌వాల్ విసురుతున్న అమెరికా

ఓ ఐపీఎల్ సీజ‌న్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన కెప్టెన్లు వీరే..

షేన్ వార్న్ (రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌) – 2008లో 19 వికెట్లు
అనిల్ కుంబ్లే (రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు) – 2010లో 17 వికెట్లు
పాట్ క‌మిన్స్ (స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌) – 2024లో 17 వికెట్లు
ర‌విచంద్ర‌న్ అశ్విన్ (పంజాబ్ కింగ్స్‌) – 2019లో 15 వికెట్లు
షేన్ వార్న్ (రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌) – 2009లో 14 వికెట్లు

ట్రెండింగ్ వార్తలు