IND vs AUS
IND vs AUS: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమ్ఇండియా అదరగొడుతోంది. ఓటమే ఎరగకుండా సెమీస్‌లో అడుగుపెట్టింది. ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో భారత్ జట్టు విజయాన్ని సాధించింది. ఈ విజయంతో గ్రూప్-ఏలో భారత్ అగ్రస్థానానికి చేరుకుంది.
Also Read: IND vs NZ : చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి..
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 250 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు భారత స్పిన్నర్ల ధాటికి విలవిల్లాడింది. ఫలితంగా 45.3 ఓవర్లలో 205 పరుగులకు కివీస్ జట్టు ఆలౌట్ అయింది. దీంతో గ్రూప్ -ఏ నుంచి పాయింట్ల పట్టికలో భారత్ జట్టు అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. దీంతో గ్రూప్-బిలోని రెండో స్థానంలో ఉన్న ఆసీస్ జట్టుతో టీమిండియా తలపడనుంది.
సెమీ ఫైనల్స్ -1లో భాగంగా మంగళవారం ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే, న్యూజిలాండ్ జట్టుపై విజయం అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఆసీస్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఆస్ట్రేలియా జట్టుకు ఐసీసీ టోర్నమెంట్ లలో మంచి రికార్డు ఉంది. కానీ, ఈ సెమీస్ లో తాము బాగా ఆడాలనుకుంటున్నాం. ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా ఉంటుంది. ఆ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నామని రోహిత్ శర్మ చెప్పారు. కివీస్ పై ఐదు వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి గురించి మాట్లాడుతూ.. అతనిలో ఏదో తెలియని శక్తి ఉంది. అతను ఏ విధంగా తనలోని ప్రతిభను ప్రదర్శిస్తాడో తెలుసుకునేందుకు ఈ మ్యాచ్ లో అవకాశమిచ్చాం. వరుణ్ రాణించడంతో ఇప్పుడు అతడిని సెమీ ఫైనల్ మ్యాచ్ కు తుది జట్టు నుంచి తప్పిస్తే విమర్శలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. దీంతో సెమీస్ లో జట్టు కూర్పు గురించి తాము కాస్త ఎక్కువగానే ఆలోచించాలని రోహిత్ శర్మ అన్నారు.
భారత్, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటి వరకు 151 వన్డే మ్యాచ్ లలో తలపడ్డాయి. ఇందులో ఆస్ట్రేలియా జట్టు 84 మ్యాచ్ లలో విజయం సాధించగా.. 57 మ్యాచ్ లలో టీమిండియా విజయం సాధించింది. 10 మ్యాచ్ లు అసంపూర్ణంగా ముగిశాయి.
Rohit Sharma said, “we’re all looking forward to the match against Australia”. pic.twitter.com/qFPI7qKB6B
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 2, 2025