ప్లే ఆఫ్‌ బెర్త్ ఖాయం చేసుకున్న చెన్నై

ప్లే ఆఫ్‌ బెర్త్ ఖాయం చేసుకున్న చెన్నై

Updated On : April 28, 2019 / 11:15 AM IST

ప్రస్తుత సీజన్‌లోనూ ప్లే ఆఫ్ రేసుకు అన్ని జట్ల కంటే ముందుగా బెర్త్ ఖాయం చేసుకుని రికార్డు సృష్టించింది చెన్నై సూపర్ కింగ్స్. జైపూర్ వేదికగా జరిగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఓడిపోవడంతో ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది. చెన్నై ఆడిన ప్రతి సీజన్‌లోనూ ప్లే ఆఫ్‌ బెర్త్ దక్కించుకున్న తొలి జట్టుగా ఘనత సాధించింది. 
 
ఐపీఎల్ 2019 సీజన్‌లో ఆడిన 12మ్యాచ్‌లలో 8గెలిచి అగ్రస్థానంలో కొనసాగుతోంది చెన్నై. ఆ తర్వాతి స్థానాల్లో ముంబై, ఢిల్లీలు 14పాయింట్లతో కొనసాగుతున్నాయి. ఈ 2జట్లు ఇంకా 3మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా వాటిల్లో గెలిస్తే 20 పాయింట్లతో టాప్ స్థానాల్లో చేరినా చెన్నైకు టాప్ 4దక్కడం ఖాయం. లీగ్ దశలో మిగిలి ఉన్న 2 మ్యాచ్‌ల్లో.. ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లపై గెలవకపోయినా ఎటువంటి తేడాలేదు. 

లీగ్ దశలో ప్రతి జట్టు 14మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా 16 పాయింట్లు దక్కించుకున్న జట్టే ప్లే ఆఫ్ రేసులో నిలుస్తుంది. బెంగళూరు, కోల్‌కతా, రాజస్థాన్ జట్లు మిగిలి ఉన్న మ్యాచ్‌లు అన్ని గెలిచినప్పటికీ.. కేవలం 14 పాయింట్లు మాత్రమే సాధించగలవు. 16 పాయింట్లు దక్కించుకునే అవకాశమున్న పంజాబ్, హైదరాబాద్‌లు విఫలమైతే మాత్రం నెట్‌రన్‌‌రేట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.