MS Dhoni : ఊపిరి బిగ‌బ‌ట్టుకున్న అభిమానులు.. రాజ‌స్థాన్‌తో మ్యాచ్ త‌రువాత ధోని రిటైర్‌మెంట్ ? సీఎస్‌కే పోస్ట్ పై నెటిజన్లు..

చెన్నై సూప‌ర్ కింగ్స్ సోష‌ల్ మీడియాలో చేసిన పోస్ట్ అభిమానుల్లో గుబులు రేపుతోంది.

MS Dhoni : ఊపిరి బిగ‌బ‌ట్టుకున్న అభిమానులు.. రాజ‌స్థాన్‌తో మ్యాచ్ త‌రువాత ధోని రిటైర్‌మెంట్ ? సీఎస్‌కే పోస్ట్ పై నెటిజన్లు..

Chennai Super Kings Stay Back Post Leaves Fans Guessing

Updated On : May 12, 2024 / 5:24 PM IST

MS Dhoni – CSK : ప్లే ఆఫ్స్ రేసులో నిల‌వాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన స్థితిలో ఉన్న చెన్నై సూప‌ర్ కింగ్స్ చెపాక్ వేదిక‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో త‌ల‌ప‌డుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజ‌స్థాన్ కెప్టెన్ సంజూ శాంస‌న్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో సీఎస్‌కే తొలుత బౌలింగ్ చేయ‌నుంది. ఈ మ్యాచ్ ఇరు జ‌ట్ల‌కు కీల‌కమైన మ్యాచ్. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఆర్ఆర్ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్ట‌నుండ‌గా.. సీఎస్‌కే విజ‌యం సాధిస్తే ప్లే ఆఫ్స్‌కు మ‌రింత చేరువ‌కానుంది. ఒక‌వేళ చెన్నై ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు సంక్లిష్టం కానున్నాయి.

ఈ మ్యాచ్ సంగ‌తి కాస్త ప‌క్క‌న బెడితే.. మ్యాచ్‌కు కొద్ది సేప‌టి ముందు చెన్నై సూప‌ర్ కింగ్స్ సోష‌ల్ మీడియాలో చేసిన పోస్ట్ అభిమానుల్లో గుబులు రేపుతోంది. ‘అభిమానులు అంద‌రికి ప్ర‌త్యేక విజ్ఞ‌ప్తి. మ్యాచ్ అయిపోయిన త‌రువాత కూడా గ్రౌండ్‌లోనే ఉండండి. ఎవ్వ‌రూ వెళ్ల‌వ‌ద్దు. ఓ ప్ర‌త్యేక‌మైనది అనౌన్స్‌మెంట్ రానుంది.’ అని పోస్ట్ చేసింది.

Virat Kohli : ఢిల్లీతో మ్యాచ్‌.. అరుదైన మైలురాయి ముంగిట విరాట్ కోహ్లి.. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఒకే ఒక్క‌డు

దీన్ని చూసిన అభిమానులు ఇది ఖ‌చ్చితంగా మ‌హేంద్ర సింగ్ ధోనికి సంబంధించిన‌దే అని అంటున్నారు. ధోనికి ఇదే ఆఖ‌రి సీజ‌న్ అని ఓ వైపు ప్ర‌చారం జ‌రుగుతుండ‌డం, ఇప్పుడు చెన్నై అనౌన్స్‌మెంట్ అని చెప్ప‌డంతో ధోని రిటైర్‌మెంట్ కావొచ్చున‌ని కొంద‌రు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

చెన్నై అంటే ధోనికి ఎంతో ఇష్టం. కుదిరితే త‌న ఆఖ‌రి మ్యాచ్‌ను చెన్నైలోనే ఆడ‌తాన‌ని ఓ సంద‌ర్భంలో ధోని చెప్పాడు. కాగా.. ఈ సీజ‌న్‌లో హోం గ్రౌండ్ అయిన చెపాక్‌లో చెన్నైకి ఇదే చివ‌రి మ్యాచ్‌. ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ చెపాక్‌లోనే జ‌ర‌గ‌నుంది. అయితే.. ప్ర‌స్తుతం ప‌రిస్థితుల్లో చెన్నై ఫైన‌ల్‌కు రావ‌డం కాస్త క‌ష్ట‌మే. ఈ క్ర‌మంలోనే ధోనికి ఇది చివ‌రి మ్యాచ్ కానుందా అనే సందేహాలు అభిమానుల మ‌దిలో మెదులుతున్నాయి. మ‌రీ అస‌లు విష‌యం ఏంటి అనేది మ్యాచ్ అయిపోతేనే గానీ తెలియ‌దు

Rohit Sharma : కోల్‌క‌తా డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ శ‌ర్మ‌.. ముంబైని వీడ‌డం ఖాయ‌మైన‌ట్లేనా?