క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్ లకు వేదికలు సిద్ధం చేసింది. ఈ క్రమంలో చెన్నైలోని చెపాక్ స్టేడియం ఓ వేదికగా ఎంపికైంది.
క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్ లకు వేదికలు సిద్ధం చేసింది. ఈ క్రమంలో చెన్నైలోని చెపాక్ స్టేడియం ఓ వేదికగా ఎంపికైంది. సుప్రీం కోర్టు అపాయింట్ చేసిన కమిటీ ఆఫ్ అడ్మినిస్టేషన్(సీఓఏ) ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ మీటింగ్ కు బీసీసీఐ ఆఫీస్ బేరర్లను ఆహ్వానించారు. చెపాక్ స్టేడియం మరోసారి బీసీసీఐ దృష్టికొచ్చింది.
Read Also : తిట్టేది అభిమానంతో.. కొట్టేది ప్రేమతో : బాలయ్య భార్య వసుంధర
డిఫెండింగ్ చాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ కనీసం 2 ప్లే ఆఫ్ మ్యాచ్ లకు వేదిక కానుంది. బీసీసీఐ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ఇది రెగ్యూలర్ మీటింగ్ లలో ఒకటిగా సర్వసాధారణంగా జరిగింది. ప్లే ఆఫ్ మ్యాచ్ లకు వేదికగా మారడానికి చెన్నై స్టేడియానికి 8 ఏళ్లు పట్టింది. బ్రాడ్ కాస్టర్లకు ఈ వార్త ఇదొక చేదువార్త’ అని తెలిపాడు.
మార్చి 23 నుంచి మొదలైన ఐపీఎల్ ఏప్రిల్ 7 నాటికి లీగ్ లో 21 మ్యాచ్ లు పూర్తి చేసుకుంది. లీగ్ పట్టికలో కోల్ కతా నైట్ రైడర్స్ 8 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఆర్సీబీ 0 పాయింట్లతో చివరి స్థానంలో కొనసాగుతోంది.
Read Also : ఐడియా అదుర్స్ : ట్యాక్సీపై IPL లైవ్ స్కోరు