World Archery Championship 2025 : ఆర్చరీ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో అద‌ర‌గొట్టిన భార‌త ఆర్చ‌ర్లు.. గోల్డ్‌మెడ‌ల్‌.. చ‌రిత్ర‌లో తొలిసారి

ఆర్చరీ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌(World Archery Championship 2025)లో భార‌త ఆర్చ‌ర్లు అద‌ర‌గొట్టారు.

World Archery Championship 2025 : ఆర్చరీ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో అద‌ర‌గొట్టిన భార‌త ఆర్చ‌ర్లు.. గోల్డ్‌మెడ‌ల్‌.. చ‌రిత్ర‌లో తొలిసారి

World Archery Championship 2025 India wins gold and silver

Updated On : September 7, 2025 / 2:36 PM IST

World Archery Championship 2025 : దక్షిణ కొరియాలోని గ్వాంగ్జులో జ‌రిగిన ఆర్చరీ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో (World Archery Championship 2025)భార‌త ఆర్చ‌ర్లు దుమ్ములేపారు. ఓ స్వ‌ర్ణంతో పాటు ర‌జ‌త ప‌త‌కాన్ని సాధించారు. పురుషుల ఈవెంట్‌లో స్వ‌ర్ణం అందుకోగా, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ర‌జ‌తాన్ని సొంతం చేసుకున్నారు.

రిషబ్ యాదవ్, అమన్ సైని, ప్రథమేష్ ఫుగే బృందం పురుషుల ఈవెంట్‌లో ఫైన‌ల్‌లో ఫ్రాన్స్‌తో త‌ల‌ప‌డ్డారు. హోరాహోరీగా సాగిన ఫైన‌ల్‌లో రెండు పాయింట్ల తేడాతో విజ‌యం సాధించారు. భార‌త టీమ్ 235 పాయింట్లు సాధించ‌గా ఫ్రాన్స్ 233 పాయింట్లు సాధించింది. భార‌త పురుషుల జ‌ట్టు ఈ మెగా ఈవెంట్‌లో స్వ‌ర్ణం సాధించ‌డం ఇదే తొలిసారి.

Sikander Raza : చరిత్ర సృష్టించిన సికింద‌ర్ ర‌జా.. కోహ్లీ, సూర్య‌కుమార్‌ను వెన‌క్కి నెట్టి..

అంతకు ముందు మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో జ్యోతి సురేఖ వెన్నం, రిషబ్ యాదవ్‌లతో కూడిన భారత జ‌ట్టు తృటిలో స్వ‌ర్ణాన్ని చేజార్చుకుంది. ఫైన‌ల్‌లో నెద‌ర్లాండ్స్ ద్వ‌యం చేతిలో రెండు పాయింట్ల తేడాతో ఓడిపోయింది. భార‌త బృందం 155 పాయింట్లు సాధించ‌గా నెద‌ర్లాండ్స్ బృందం 157 పాయింట్లు సాధించింది.

CPL 2025 : సీపీఎల్‌లో కీర‌న్ పొలార్డ్ ఊచకోత‌.. 6,6,6,6,6.. 4,4,4,4,4

ఇదిలా ఉంటే.. ప్ర‌పంచ ఛాంపియ‌న్‌షిప్‌లో జ్యోతి సురేఖ‌కు ఇది తొమ్మిదో ప‌త‌కం కావ‌డం విశేషం. వ్యక్తిగ‌త విభాగంలో ఓ ర‌జ‌తం, రెండు క్యాంసాలు గెల‌వ‌గా, నాలుగు టీమ్ ప‌త‌కాలు (రెండు స్వ‌ర్ణాలు, రెండు ర‌జ‌తాలు, ఓ క్యాంసం), రెండు కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ర‌జ‌తాల‌ను గెలుచుకుంది