Marnus Labuschagne hat trick : బంతితో సత్తాచాటిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ లబుషేన్.. హ్యాట్రిక్.. వీడియో
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మార్నస్ లబుషేన్ (Marnus Labuschagne hat trick) బౌలింగ్‌లో హ్యాట్రిక్ సాధించాడు.

Marnus Labuschagne takes hat trick in T20 Max Final
Marnus Labuschagne hat trick : ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ బంతితోనూ సత్తాచాటాడు. దేశవాలీ టీ20 టోర్నీలో హ్యాట్రిక్‌తో చెలరేగాడు. బ్రిస్బేన్‌లో జరిగిన కేఎఫ్‌సీ మ్యాక్స్ టీ20 టోర్నీలో అతడు ఈ ఘనత సాధించాడు. హ్యాట్రిక్ వికెట్లు (Marnus Labuschagne hat trick) తీసి తన జట్టుకు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు.
రెడ్‌ల్యాండ్స్ టైగర్స్‌కు లబుషేన్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వ్యాలీ, రెడ్ ల్యాండ్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రెడ్‌ల్యాండ్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు సాధించింది.
రెడ్‌ల్యాండ్స్ బ్యాటర్లలో జిమ్మీ పీర్సన్ (102 నాటౌట్; 50 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సులు) శతకంతో చెలరేగాడు. లబుషేన్ (10 బంతుల్లో 16 పరుగులు) పర్వాలేదనిపించాడు. వ్యాలీ తరఫున బెంజి ఫ్లోరోస్ రెండు వికెట్లు పడగొట్టాడు. జాక్ వైల్డర్‌ముత్, కామెరాన్ బోయ్స్, టిగే మోరిస్, టామ్ హాలియన్ తలా ఓ వికెట్ సాధించారు.
Marnus Labuschagne took a a hattrick in the KFC T20 Max Final. 🤯pic.twitter.com/8ye7U7udVu
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 7, 2025
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో వ్యాలీ జట్టు 17.2 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది. దీంతో రెడ్ ల్యాండ్స్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. వ్యాలీ బ్యాటర్లలో బ్రియాంట్ (38 బంతుల్లో 76 పరుగులు) రాణించాడు. లబుషేన్ చివర్లలో మూడు వికెట్లు తీశాడు. అంతేకాదండోయ్ .. ఫీల్డర్‌గానూ సత్తా చాటాడు. 3 క్యాచ్‌లు అందుకున్నాడు.
Sikander Raza : చరిత్ర సృష్టించిన సికిందర్ రజా.. కోహ్లీ, సూర్యకుమార్‌ను వెనక్కి నెట్టి..
గతకొన్నాళ్లుగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న లబుషేన్‌ను ఆస్ట్రేలియా టెస్టు జట్టు నుంచి తప్పించింది. యాషెస్ సిరీస్‌లో చోటే లక్ష్యంగా లబుషేన్ దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు.