Cheteshwar Pujara : శ‌త‌కంతో చెల‌రేగిన పుజారా.. బ్రియాన్ లారా రికార్డు బ‌ద్ద‌లు.. రీఎంట్రీ ఇచ్చేనా?

టీమ్ఇండియా టెస్టు స్పెష‌లిస్ట్ పుజారా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

Cheteshwar Pujara overtakes Brian Lara in list of First Class hundreds

Cheteshwar Pujara First Class hundreds : టీమ్ఇండియా టెస్టు స్పెష‌లిస్ట్ పుజారా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. త‌న కెరీర్‌లో ఎన్నో మ్యాచుల్లో టీమ్ఇండియా ఓడిపోకుండా అడ్డుగోడగా నిలిచాడు. పేల‌వ ఫామ్ కార‌ణంగా జ‌ట్టులో చోటు కోల్పోయాడు. అదే స‌మ‌యంలో యువ ఆట‌గాళ్లు స‌త్తా చాట‌డంతో రీ ఎంట్రీ క‌ష్టంగా మారింది. అయితే.. రంజీట్రోఫీలో ఆడుతూ ఫామ్ అందుకున్నాడు పుజారా. సౌరాష్ట్ర త‌రుపున బ‌రిలోకి దిగిన పుజారా ఛ‌త్తీస్‌గ‌డ్ పై శ‌త‌కంతో చెల‌రేగాడు.

ఫ‌స్ట్‌కాస్ క్రికెట్‌లో పుజ‌రాకు ఇది 66వ సెంచ‌రీ. ఈ క్ర‌మంలో వెస్టిండీస్ దిగ్గ‌జ ఆట‌గాడు బ్రియాన్ లారాను అధిగ‌మించాడు. లారా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్ లో 65 శ‌త‌కాలు బాదాడు.

BAN vs SA : చ‌రిత్ర సృష్టించిన క‌గిసో రబాడ.. ప్ర‌పంచ రికార్డు బ్రేక్‌..

ఛ‌త్తీస్‌గ‌డ్ తొలి ఇన్నింగ్స్‌లో 578 ప‌రుగులు చేసింది. అనంత‌రం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన సౌరాష్ట్ర 81 ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోయింది. ఫ‌స్ట్ డౌన్‌లో బ్యాటింగ్ వ‌చ్చిన పుజారా శ‌త‌కం బాదాడు. రంజీట్రోఫీలో ఇది అత‌డికి 25 సెంచ‌రీ కావ‌డం విశేషం.

తాజా శ‌త‌కంతో ఫస్ట్ క్లాస్‌లో పుజారా 21 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఫస్ట్ క్లాస్‌లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో భార‌త ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఆ జాబితాలో 25834 ప‌రుగుల‌తో సునీల్ గవాస్కర్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. ఆ త‌రువాత‌ సచిన్ టెండూల్కర్ 25396 పరుగులు, రాహుల్ ద్రవిడ్ 23784 పరుగులతో వ‌రుస‌గా రెండు, మూడు స్థానాల్లో కొన‌సాగుతున్నారు.

Babar Azam : బాబ‌ర్ ఆజామ్‌కు వీరేంద్ర సెహ్వాగ్ కీల‌క సూచ‌న‌లు.. ఇలా చేయ్‌.. లేదంటే..

ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో పుజారా మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో స‌చిన్‌, గ‌వాస్క‌ర్‌లు చెరో 88 శ‌త‌కాల‌తో తొలి స్థానంలో ఉన్నారు. 68 శ‌త‌కాల‌తో రాహుల్ ద్ర‌విడ్‌ రెండో స్థానం, 66 శ‌త‌కాల‌తో పుజారా మూడో స్థానంలో ఉన్నారు.