BAN vs SA : చ‌రిత్ర సృష్టించిన క‌గిసో రబాడ.. ప్ర‌పంచ రికార్డు బ్రేక్‌..

దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ అరుదైన ఘ‌నత సాధించాడు.

BAN vs SA : చ‌రిత్ర సృష్టించిన క‌గిసో రబాడ.. ప్ర‌పంచ రికార్డు బ్రేక్‌..

Kagiso Rabada become fastest bowler to take 300 wickets in terms of balls in Tests

Updated On : October 21, 2024 / 1:01 PM IST

BAN vs SA : దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ అరుదైన ఘ‌నత సాధించాడు. బంతుల ప‌రంగా టెస్టుల్లో అత్యంత వేగంగా 300 వికెట్ల తీసిన ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. ఢాకా వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ముష్ఫికర్ రహీమ్‌ను ఔట్ చేయ‌డం ద్వారా ర‌బాడ ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు. ఈ క్ర‌మంలో అత‌డు పాకిస్థాన్ మాజీ పేస‌ర్ వ‌కార్ యూనిస్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు.

12602 బంతుల్లో వ‌కార్ టెస్టుల్లో 300 వికెట్లు తీయ‌గా ర‌బాడ కేవ‌లం 11817 బంతుల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. వీరిద్ద‌రి త‌రువాతి స్థానాల్లో డేల్ స్టెయిన్‌, అలాన్‌డొనాల్డ్ ఉన్నారు.

Babar Azam : బాబ‌ర్ ఆజామ్‌కు వీరేంద్ర సెహ్వాగ్ కీల‌క సూచ‌న‌లు.. ఇలా చేయ్‌.. లేదంటే..

బంతుల ప‌రంగా టెస్టుల్లో అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన ఆట‌గాళ్లు..
* క‌గిసో ర‌బాడ (ద‌క్షిణాఫ్రికా) – 11817 బంతులు
* వ‌కార్ యూనిస్ (పాకిస్థాన్‌) – 12602 బంతులు
* డేల్ స్టెయిన్ (ద‌క్షిణాఫ్రికా) – 12605 బంతులు
* అలాన్ డొనాల్డ్ (ద‌క్షిణాఫ్రికా) – 13672 బంతులు

మూడో స‌ఫారీ పేస‌ర్‌..

టెస్టుల్లో 300 వికెట్లు తీసిన మూడో ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్‌గా ర‌బాడ నిలిచాడు. అత‌డి కంటే ముందు డేల్ స్టెయిన్‌, డొనాల్డ్ ఉన్నారు. 65 మ్యాచుల్లో ర‌బాడ ఈ ఘ‌న‌త అందుకోగా.. స్టెయిన్ 61 మ్యాచుల్లో, డొనాల్డ్ లు 63 మ్యాచుల్లోనే అందుకున్నారు. ఇక ఓవ‌రాల్‌గా ద‌క్షిణాఫ్రికా త‌రుపున టెస్టుల్లో అత్య‌ధిక వికెట్లు తీసిన ఆరో బౌల‌ర్‌గా ర‌బాడ రికార్డుల‌కు ఎక్కాడు.

T20 World Cup 2024 : తొలిసారి విశ్వ‌విజేత‌గా నిలిచిన న్యూజిలాండ్‌కు భారీ ప్రైజ్‌మ‌నీ.. భార‌త జ‌ట్టుకు ఎంతో తెలుసా?

టెస్టుల్లో ద‌క్షిణాఫ్రికా త‌రుపున అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్లు..

డేల్ స్టెయిన్ – 93 మ్యాచుల్లో 439 వికెట్లు
షాన్ పొలాక్ – 108 మ్యాచుల్లో 421 వికెట్లు
మఖాయ ఎంతిని – 101 మ్యాచుల్లో 390 వికెట్లు
అలెన్ డొనాల్డ్ – 72 మ్యాచుల్లో 330 వికెట్లు
మోర్నీ మోర్కెల్ – 86 మ్యాచుల్లో 309 వికెట్లు
క‌గిసో ర‌బాడ – 65 మ్యాచుల్లో 301* వికెట్లు