Chris Gayle And MS Dhoni Reunion: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ దగ్గర పడుతుండడంతో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని యాక్టివ్ అయిపోయాడు. ఇటీవలే ప్రాక్టీస్ షురూ చేసిన మిస్టర్ కూల్ వరుస భేటీలతో అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ క్రిస్ గేల్ తో కలిశాడు ధోని. ఈ ఫొటోను గేల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. ఒకరి భుజాలపై ఒకరు చేతులు వేసి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ ఫొటోకు “లాంగ్ లైవ్ ది లెజెండ్స్” క్యాప్షన్ పెట్టాడు గేల్.
ఇక ఐపీఎల్ వీరిద్దరికీ ఘనమైన రికార్డులు ఉన్నాయి. తాజా ఐపీఎల్ సీజన్ సత్తా చాటేందుకు ధోని రెడీ అవుతున్నాడు. గత సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ నిరాశపరచడంతో ఈసారి బాగా ఆడాలని మిస్టర్ కూల్ భావిస్తున్నాడు. తమ టీమ్ కు పూర్వ వైభవం తేవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. క్రిస్ గేల్ మాత్రం 2021 నుంచి ఐపీఎల్ టోర్నమెంట్ ఆడలేదు. తాజాగా ధోనితో కలిసి గేల్ కనబడటంతో క్రీడాభిమానులు పండగ చేసుకుంటున్నారు.
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీని ఇటీవల ముంబైలో కలిశాడు ధోని. వీరి ఫొటోలను చెన్నై సూపర్ కింగ్స్ తన అధికారి ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ చేయడంతో వైరల్ గా మారాయి. ఐపీఎల్ 2023, ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది.