వైస్ కెప్టెన్‌గా క్రిస్ గేల్: వరల్డ్ కప్ స్పెషల్

వరల్డ్ కప్ ముంగిట విధ్వసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌కు కొత్త బాధ్యతలు అప్పజెప్పారు. వెస్టిండీజస్ జాతీయ జట్టుకు వైస్ కెప్టెన్‌గా నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. జూన్ 2010వన్డేలలో జట్టు కెప్టెన్సీ వహించిన గేల్‌ను జాసన్ హోల్డర్‌కు వైస్ కెప్టెన్‌గా ఖరారు చేశారు.
ఈ సందర్భంగా గేల్ మాట్లాడుతూ.. ‘వెస్టిండీస్ జట్టుకు ఏ ఫార్మాట్‌లో ఆడినా గౌరవంగా ఉంటుంది. అది వరల్డ్ కప్‌కు ఆడటమంటే చాలా ప్రత్యేకతతో కూడింది. సీనియర్ ఆటగాడిగా కెప్టెన్‌కు సహకరిస్తూనే నా బాధ్యతను నిర్వర్తిస్తా. ఇది చాలా పెద్ద వరల్డ్ కప్. వెస్టిండీస్ ప్రజల కోసం మా వంతు అయినంత మేం కష్టపడతాం’ అని తెలిపాడు.
దాంతో పాటు బోర్డు మంగళవారం ఐర్లాండ్, బంగ్లాదేశ్‌తో జరగనున్న ముక్కోణపు సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా షై హోప్‌ను నియమించింది. ఈ నియామకం పట్ల హోప్ తన సంతోషాన్ని తెలియజేశఆడు. మేనేజ్‌మెంట్ అడిగిన వెంటనే సరేనన్నానని తెలిపాడు. వెస్టిండీస్ క్రికెట్ కోసం ఏం చేయమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు.