Bcci Oxygen Concentrates
Covid-19: BCCI donate 2,000 oxygen concentrates : కరోనా మహమ్మారి రెండో వేవ్ దేశాన్ని అతులాకుతలం చేస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా పోరాటంలో తన వంతు కృషి చేసేందుకు బీసీసీఐ ముందుకొచ్చింది. కరోనా కష్టకాలంలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (BCCI) పెద్ద మనస్సు చాటుకుంటోంది. కరోనా కష్టకాలంలో వైద్య సంస్థలకు భారీ విరాళం ఇవ్వనుంది బీసీసీఐ.
వివిధ వైద్య సంస్థలకు 10 లీటర్ల చొప్పున 2 వేల ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను పంపిణీ చేయనున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) తెలిపింది. కరోనా సంక్షోభం కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ -19 మహమ్మారిని అధిగమించడంలో భారత్ ప్రయత్నాలను బలోపేతం చేసేందుకు 10-లీటర్ 2,000 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందిస్తామని బీసీసీఐ ప్రకటించింది.
కరోనావైరస్ రెండవ వేవ్ ఉధృతితో దేశమంతా తీవ్రంగా దెబ్బతింది. ప్రత్యేకించి మెడికల్ మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలు, ఆక్సిజన్ డిమాండ్లు పెరిగాయి. రాబోయే కొద్ది నెలల్లో, కరోనా రోగులకు అత్యవసర వైద్య సహాయం సంరక్షణ అందించాలని బీసీసీఐ కోరుతోంది.
అందుకే బోర్డు భారతదేశం అంతటా ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను పంపిణీ చేస్తుంది. గత ఏడాదిలో మహమ్మారి మొదటి వేవ్‌లో భారత క్రికెట్ బోర్డు PM కేర్స్ ఫండ్‌కు రూ.51 కోట్లు విరాళం ఇచ్చింది. వైరస్‌పై సాగుతున్న సుదీర్ఘ యుద్ధంలో పోరాడుతున్న వైద్య, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల విశేష కృషిని బీసీసీఐ ప్రత్యేకంగా అభినందించింది.