CPL 2025 : షిమ్రాన్ ఏమా కొట్టుడు సామీ.. నీకు తోడుగా షైహోప్‌, షెపర్డ్ కూడానా.. తాహిర్ పాంచ్ ప‌టాకా..

క‌రేబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2025 (CPL 2025) సీజ‌న్‌లో మ్యాచ్‌లు ఆస‌క్తిక‌రంగా సాగుతున్నాయి. ఈ లీగ్‌లో భాగంగా..

CPL 2025 Guyana Amazon Warriors won by 83 runs against Antigua and Barbuda Falcons

CPL 2025 : క‌రేబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2025 (CPL 2025) సీజ‌న్‌లో మ్యాచ్‌లు ఆస‌క్తిక‌రంగా సాగుతున్నాయి.

ఈ లీగ్‌లో భాగంగా భార‌త కాల‌మానం ప్ర‌కారం శ‌నివారం తెల్ల‌వారుజామున ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్, గయానా అమెజాన్ వారియర్స్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది.

ఈ మ్యాచ్‌లో గ‌యానా బ్యాట‌ర్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా షై హోప్‌, షిమ్రాన్ హెట్మైర్(Shimron Hetmyer), రొమారియో షెపర్డ్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయారు. దీంతో ఈ మ్యాచ్‌లో గ‌యానా జ‌ట్టు 83 ప‌రుగులు తేడాతో విజ‌యం సాధించింది.

ఈ మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ జ‌ట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. షై హోప్‌(82; 54 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), షిమ్రాన్ హెట్మైర్ (65 నాటౌట్; 26 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), రొమారియో షెపర్డ్ (25 నాటౌట్; 8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) దంచికొట్ట‌డంతో గ‌యానా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్ల న‌ష్టానికి 211 ప‌రుగుల భారీ స్కోరు సాధించింది.

SA20 : పీయూష్ చావ్లా నుంచి సిద్దార్థ్ కౌల్ వ‌ర‌కు.. సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆడేందుకు క్యూ క‌డుతున్న భార‌త ఆట‌గాళ్లు..

గ‌యానా బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ బెన్ మెక్‌డెర్మాట్(8) విప‌ల‌మైన‌ప్ప‌టికి మ‌రో ఓపెన‌ర్ కెవ్లాన్ ఆండర్సన్ (22) ఫ‌ర్వాలేద‌నిపించాడు. ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ బౌల‌ర్ల‌లో కెప్టెన్ ఇమాద్ వసీం, జేడెన్ సీల్స్, ఓబెద్ మెక్కాయ్ లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

అనంత‌రం 212 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆంటిగ్వా జ‌ట్టు 15.2 ఓవ‌ర్ల‌లో 128 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఆంటిగ్వా బ్యాట‌ర్ల‌లో కరీమా గోర్ (31), బెవాన్ జాకబ్స్ (26) లు ఓ మోస్త‌రుగా రాణించగా మిగిలిన వారు దారుణంగా విఫ‌లం అయ్యారు.

BCCI : ఆసియాక‌ప్‌కు ముందు బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం.. స‌పోర్ట్ స్టాఫ్‌ నుంచి ఒక‌రు ఔట్‌..

గ‌యానా బౌల‌ర్ల‌లో కెప్టెన్ ఇమ్రాన్ తాహిర్ 5 వికెట్ల‌తో ఆంటిగ్వా ప‌త‌నాన్ని శాసించాడు. డ్వైన్ ప్రిటోరియస్, రొమారియో షెపర్డ్ లు చెరో రెండు వికెట్లు తీశారు. గుడాకేష్ మోతీ ఓ వికెట్ సాధించాడు.