Cricket Australia announced 17 man squad for the upcoming tour of Pakistan
AUS vs PAK : ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీకి సన్నాహకాల్లో భాగంగా ఈ నెల చివరిలో ఆస్ట్రేలియా జట్టు పాకిస్తాన్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. జనవరి 29 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.
17 మంది సభ్యులతో కూడిన బృందానికి మిచెల్ మార్ష్ నాయకత్వం వహించనున్నాడు. నాథన్ ఎల్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్‌లను ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. వారికి విశ్రాంతి ఇచ్చింది. యువ ఆటగాళ్లు మహ్లీ బియర్డ్‌మాన్, జాక్ ఎడ్వర్డ్స్‌లను ఎంపిక చేసింది. ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్ 2026లో ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. టీ20 ప్రపంచకప్ 2026 ఎంపికైన ఆటగాళ్లలో 10 మంది ప్లేయర్లను పాకిస్తాన్‌తో సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది.
పాక్‌తో టీ20 సిరీస్‌కు ఆసీస్ జట్టు ఇదే..
మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, మహ్లి బియర్డ్‌మాన్, కూపర్ కానోలీ, బెన్ ద్వార్షుయిస్, జాక్ ఎడ్వర్డ్స్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (కీపర్), మాథ్యూ కునెమన్, మిచ్ ఓవెన్, జోష్ ఫిలిప్, మాథ్యూ రెన్షా, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.
పాక్, ఆసీస్ టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..
* తొలి టీ20 మ్యాచ్ – జనవరి 29
* రెండో టీ20 మ్యాచ్ – జనవరి 31
* మూడో టీ20 మ్యాచ్ – ఫిబ్రవరి 1
Virat Kohli : శతకాలతో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. న్యూజిలాండ్ పై ఒకే ఒక్కడు..
Introducing our 17-player men’s squad for the T20 International Series against Pakistan in Lahore later this month 🇵🇰 pic.twitter.com/XcD17Bxyib
— Cricket Australia (@CricketAus) January 19, 2026
టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు..
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, పాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మాట్ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.