Test Team of the Year 2024 : కెప్టెన్‌గా జ‌స్‌ప్రీత్ బుమ్రా.. క్రికెట్ ఆస్ట్రేలియా 2024 అత్యుత్త‌మ టెస్టు జ‌ట్టు ఇదే..

మ‌రికొన్ని గంట‌ల్లో కొత్త ఏడాదికి స్వాగ‌తం చెప్పేందుకు ప్ర‌పంచం సిద్ధ‌మ‌వుతోంది.

Cricket Australia announces Test Team of the Year 2024 Jasprit Bumrah named captain

మ‌రికొన్ని గంట‌ల్లో కొత్త ఏడాదికి స్వాగ‌తం చెప్పేందుకు ప్ర‌పంచం సిద్ధ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో క్రికెట్ ఆస్ట్రేలియా 2024 సంవ‌త్స‌రానికి గాను అత్యుత్త‌మ టెస్టు జట్టును ప్ర‌క‌టించింది. టీమ్ఇండియా స్టార్ పేస‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రాను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అతడితో పాటు మ‌రో భార‌త ఆట‌గాడికి మాత్ర‌మే చోటు ఇచ్చింది.

టెస్టుల్లో అరంగ్రేటం నుంచి య‌శ‌స్వి జైస్వాల్ సుదీర్ఘ ఫార్మాట్‌లో అద‌ర‌గొడుతున్నాడు. ఈ ఏడాది అత‌డు 15 మ్యాచుల్లో 54.74 స‌గటుతో 1478 ప‌రుగులు చేశాడు. అత్య‌ధిక స్కోరు 214 ప‌రుగులు. దీంతో అత‌డిని ఓపెన‌ర్‌గా ప్ర‌క‌టించింది. అత‌డితో పాటు ఇంగ్లాండ్ స్టార్ ఆట‌గాడు బెన్‌డ‌కౌట్‌ను మ‌రో ఓపెన‌ర్‌గా సెల‌క్ట్ చేసింది. వ‌న్‌డౌన్ ఆట‌గాడిగా ఇంగ్లాండ్ స్టార్ ఆట‌గాడు జో రూట్‌ను ఎంపిక చేసింది.

Vinod Kambli : ఆస్ప‌త్రిలో వినోద్ కాంబ్లీ డ్యాన్స్‌.. చక్ దే ఇండియా పాట‌కు.. ఆనందంలో ఫ్యాన్స్‌..

న్యూజిలాండ్ ఆట‌గాడు ర‌చిన్ ర‌వీంద్ర‌ను నాలుగో స్థానానికి ఇంగ్లాండ్ యువ ఆట‌గాడు హ్యారీ బ్రూక్ ఐదో స్థానానికి సెల‌క్ట్ చేసింది. ఇక శ్రీలంక ఆట‌గాడు క‌మిందు మెండీస్‌కు ఈ జ‌ట్టులో స్థానం ద‌క్కింది. అత‌డిని ఆరో స్థానానికి ఎంపిక చేసింది.

Team India : కొత్త ఏడాది ప్రారంభంలోనే టీమ్ఇండియా అభిమానుల‌కు భారీ షాక్‌..!

వికెట్ కీప‌ర్ ఆస్ట్రేలియా కీపర్ అలెక్స్ కేరీని ఎంపిక చేసింది. ఫాస్ట్ బౌల‌ర్ల‌ జాబితాలో ఆసీస్ పేస‌ర్ జోష్ హేజిల్‌వుడ్‌, భార‌త పేస‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా, న్యూజిలాండ్ పేస‌ర్ మ్యాట్ హెన్రీల‌కు చోటు ఇచ్చింది. ఇక ఏకైక స్పిన్న‌ర్ గా ద‌క్షిణాఫ్రికాకు చెందిన కేశ‌వ్ మ‌హ‌రాజ్‌కు ఛాన్స్ ఇచ్చింది.

క్రికెట్ ఆస్ట్రేలియా ప్ర‌క‌టించిన ఈ ఏడాది అత్యుత్త‌మ టెస్టు జ‌ట్టు ఇదే..

యశస్వి జైస్వాల్, బెన్‌ డకెట్‌, జో రూట్‌, రచిన్‌ రవీంద్ర, హ్యారీ బ్రూక్‌, కమిందు మెండిస్‌, అలెక్స్‌ క్యారీ, మ్యాచ్‌ హెన్రీ, జస్‌ప్రీత్‌ బుమ్రా, జోష్‌ హాజిల్‌వుడ్, కేశవ్‌ మహరాజ్.