టీమిండియాతో టెస్ట్ సిరీస్‌.. వేదికలను ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా

ఫస్ట్ మ్యాచ్ నిర్వహణ క్రికెట్ ఆస్ట్రేలియాకు సవాలుగా మారనుంది. ఎందుకంటే ఇటీవల జరిగిన పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు పెద్దగా ప్రేక్షకులు రాలేదు.

Cricket Australia: టీమిండియాతో నవంబర్‌లో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు వేదికలను క్రికెట్ ఆస్ట్రేలియా ఖరారు చేసింది. మొదటి టెస్టుకు పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియం వేదిక కానుంది. ఫస్ట్ మ్యాచ్ నిర్వహణ క్రికెట్ ఆస్ట్రేలియాకు సవాలుగా మారనుంది. ఎందుకంటే ఇటీవల జరిగిన పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు పెద్దగా ప్రేక్షకులు రాలేదు. ఈ నేపథ్యంలో టీమిండియాతో మ్యాచ్‌కు భారీగా ప్రేక్షకులను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం వెస్ట్రన్ ఆస్ట్రేలియా సహకారం తీసుకోనుంది. గత మ్యాచ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆడియన్స్ నంబరుపై ఫోకస్ పెట్టింది.

ఆప్టస్ స్టేడియం కెపాసిటీ 60 వేలు. పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు కేవలం 17,666 సీట్లు మాత్రమే ఫిల్ అయ్యాయి. బిగ్ బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో అత్యధికంగా 28,494 మంది హాజరయ్యారు. పెర్త్‌లో టెస్టు క్రికెట్‌కు పూర్వవైభవం తీసుకురావాలని క్రికెట్ ఆస్ట్రేలియా గట్టిగా ప్రయత్నిస్తోంది. వచ్చే రెండేళ్లలో భారత్, ఇంగ్లండ్‌ జట్లు తమ దేశ పర్యటనకు వస్తుండడంతో పెర్త్‌లో టెస్టు క్రికెట్‌కు ఆదరణ క్రికెట్ ఆస్ట్రేలియా అంచనా వేస్తోంది.

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో బాక్సింగ్ డే టెస్ట్
కాగా, టీమిండియా సిరీస్‌లోని రెండో మ్యాచ్ అడిలైడ్ ఓవల్‌ మైదానంలో జరగనుండగా, మూడో టెస్టు మ్యాచ్‌కు బ్రిస్బేన్‌లోని ది గబ్బా స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. బాక్సింగ్ డే టెస్ట్ ఐకానిక్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతుంది. సిరీస్‌లోని చివరి మ్యాచ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది.

Also Read: హార్దిక్ పాండ్యాను వదలని రోహిత్ ఫ్యాన్స్.. ఎక్స్‌లో ట్రెండింగ్‌లో ఏముందో తెలుసా?

నెలాఖరులో షెడ్యూల్
టీమిండియాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ షెడ్యూల్ క్రికెట్ ఆస్ట్రేలియా ఇంకా ప్రకటించలేదు. నెలాఖరులో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా, పురుషులు, మహిళల బిగ్ బాష్ లీగ్(బీబీఎల్) సీజన్ పూర్తి వివరాలను బోర్డు ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు ఈ ఏడాది ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్‌తో జరగాల్సిన మూడు మ్యాచ్‌ల పురుషుల T20 ఇంటర్నేషనల్ హోమ్ సిరీస్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా వాయిదా వేసింది.

Also Read: పాకిస్థాన్‌లో అంత తక్కువా..! పీఎస్ఎల్ టోర్నీలో విజేత జట్టుకు ఫ్రైజ్ మనీ ఎంతో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు