2028 LA Olympics : 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌.. ఫ్యాన్స్ క‌ల నెర‌వేర‌బోతుంది..!

క్రికెట్ అభిమానుల క‌ల నెర‌వేర‌బోతోంది. 2028లో లాస్ ఏంజెలిస్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఒలింపిక్స్ క్రీడ‌ల్లో క్రికెట్ కూడా భాగం కానుంది.

Cricket in 2028 LA Olympic Games

Cricket in 2028 LA Olympic Games : క్రికెట్ అభిమానుల క‌ల నెర‌వేర‌బోతోంది. 2028లో లాస్ ఏంజెలిస్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఒలింపిక్స్ క్రీడ‌ల్లో క్రికెట్ కూడా భాగం కానుంది. క్రికెట్‌తో పాటు బేస్ బాల్/సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రోస్, స్క్వాష్‌లను కొత్తగా ఒలింపిక్స్‌లో చేర్చ‌నున్న‌ట్లు స‌మాచారం. అయితే.. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. అక్టోబ‌ర్ 15 నుంచి 17 వ‌ర‌కు ముంబైలో జ‌ర‌గ‌నున్న అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) స‌మావేశంలో క్రికెట్‌ను చేర్చాలా వ‌ద్దా అనే దానిపై తుది నిర్ణ‌యం తీసుకోనున్నారు.

ది గార్డియన్ నివేదిక ప్రకారం.. లాస్ ఏంజిల్స్ ఆర్గనైజింగ్ కమిటీ ఒలింపిక్ గేమ్స్‌లో చేర్చాల్సిన విభాగాల జాబితాను ధృవీకరించిందని, ఒలింపిక్ ప్రోగ్రామ్ కమిషన్‌తో చర్చించిన తర్వాత ముంబైలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్ తర్వాత అధికారికంగా చేర్పులను ప్ర‌క‌టించ‌నుంద‌ని తెలిపింది.

Also Read: కేఎల్ రాహుల్ కామెంట్స్‌.. అస్స‌లు ఊహించ‌లేదు.. అయ్య‌ర్ క‌నీసం రెండు ఓవ‌ర్లు అన్నా..

లాస్ ఏంజిల్స్ ఆర్గనైజింగ్ కమిటీ చేసిన సిపార్సుల‌పై అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సంతోషం వ్య‌క్తం చేసింది. ‘ఒలింపిక్స్‌లో చేర్చడానికి క్రికెట్‌ను LA28 సిఫార్సు చేసినందుకు సంతోషం. అయితే ఇది తుది నిర్ణయం కాదు.శతాబ్దం త‌రువాత మొదటిసారిగా ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చూడటంలో ఇది చాలా ముఖ్యమైన మైలురాయి.’ అని పేర్కొంది.

Also Read: సరికొత్త రికార్డు సృష్టించిన ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలాన్

కాగా.. 1900లో పారిస్ వేదిక‌గా నిర్వ‌హించిన ఒలింపిక్స్ క్రీడ‌ల్లో క్రికెట్‌ను మొద‌టి సారి చేర్చారు. అదే మొద‌టిసారి చివ‌రి సారి అయ్యింది. 128 ఏళ్ల త‌రువాత మ‌ళ్లీ క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చూసే అవ‌కాశం ఉంది. టీ20 ఫార్మాట్‌లోనే క్రికెట్ మ్యాచ్‌లు జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయి. గ‌తేడాది కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో మ‌హిళ‌ల క్రికెట్‌ను భాగం చేసిన సంగ‌తి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు