Dawid Malan సరికొత్త రికార్డు సృష్టించిన ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలాన్

వన్డే వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలాన్ చెలరేగిపోయాడు. సెంచరీతో సరికొత్త రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు.

Dawid Malan సరికొత్త రికార్డు సృష్టించిన ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలాన్

Dawid Malan Fastest to six ODI hundreds (Photo: @englandcricket)

Dawid Malan Record: ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలాన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. వన్డేల్లో వేగంగా ఆరు సెంచరీలు చేసిన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచకప్ లో భాగంగా మంగళవారం ధర్మశాలలో బంగ్లాదేశ్ తో జరుతున్న మ్యాచ్ లో అతడీ ఘనత సాధించాడు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ జట్టుకు ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలాన్ శుభారంభం అందించారు. మొదటి వికెట్ కు 115 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

జానీ బెయిర్‌స్టో 52 పరుగులు చేసి షకీబ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బెయిర్‌స్టో కంటే ముందే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన మలాన్ జోరు కొనసాగించి శతకం బాదాడు. 91 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. తన 23వ ఇన్నింగ్స్ లోనే 6వ సెంచరీ సాధించడం విశేషం. పాకిస్థాన్ బ్యాటర్ ఇమామ్-ఉల్-హక్ పేరిట ఉన్న రికార్దును మలాన్ సవరించాడు. 27వ ఇన్నింగ్స్ లో అతడు సిక్త్ సెంచరీ కొట్టాడు. తర్వాతి స్థానాల్లో ఉపుల్ తరంగ(29), బాబర్ ఆజం(32), హాషిమ్ ఆమ్లా(34) ఉన్నారు.

క్యాలెండర్ ఇయర్ లో నాలుగు సెంచరీలు చేసిన ఇంగ్లండ్ బ్యాటర్ల జాబితాలోనూ డేవిడ్ మలాన్ చోటు సంపాదించాడు. జానీ బెయిర్‌స్టో 2018లో, డేవిడ్ గోవర్ 1983లో ఒక క్యాలెండర్ ఇయర్ లో నాలుగేసి సెంచరీలు నమోదు చేశారు. వన్డే ప్రపంచకప్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన నాలుగో ఇంగ్లండ్ బ్యాటర్ గా డేవిడ్ మలాన్(140) నిలిచాడు. ఆండ్రూ స్ట్రాస్(158), జాసన్ రాయ్(153), ఇయాన్ మోర్గాన్(148) అతడి కంటే ముందున్నారు.

Also Read: ఒక్క బాల్‌కు 13 పరుగులు సాధ్యమా? కివీస్ బ్యాటర్ ఎలా కొట్టాడో ఈ వీడియో చూడండి..