Cricket World Cup
Cricket World Cup 2023 : క్రికెట్ ప్రపంచ కప్ 2023 మ్యాచ్‌లకు టికెట్ల విక్రయం శుక్రవారం రాత్రి 8 గంటలకు జరగనుంది. ధర్మశాల, లక్నో, ముంబై నగరాల్లో జరిగే భారత్ మ్యాచ్‌ల టిక్కెట్లు శుక్రవారం విక్రయించనున్నారు. (Tickets For India Matches) హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ధర్మశాల స్టేడియం, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం, లక్నో, ముంబైలోని వాంఖడే స్టేడియంలో టీమ్ ఇండియా ఆటల టిక్కెట్ల విక్రయం ఆన్ లైన్ లో జరగనుంది. (Cricket World Cup 2023)
Pakistan : ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఆత్మాహుతి దాడి… 9 మంది పాక్ సైనికుల మృతి
అక్టోబరు 5వతేదీ నుంచి నవంబర్ 19వతేదీ వరకు 10 వేదికల్లో జరగనున్న ఈ అతిపెద్ద క్రికెట్ ప్రపంచ కప్‌లో పది జట్లు పాల్గొంటాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం టోర్నమెంట్ ప్రారంభ, ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఈవెంట్‌లో 46 రోజుల పాటు 48 మ్యాచ్‌లు జరగనున్నాయి.