Yuzvendra Chahal: భార్యతో విడాకులు.. అసలు కారణం ఏంటో చెప్పేసిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్..

నిరంతర ఒత్తిడి, గందరగోళం తమ మధ్య సంబంధాన్ని ప్రభావితం చేశాయమన్నారు. ఇలాంటి సమస్యలు రోజూ తలెత్తడం ప్రారంభించినప్పుడు..

Yuzvendra Chahal: భార్యతో విడాకులు.. అసలు కారణం ఏంటో చెప్పేసిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్..

Updated On : August 1, 2025 / 6:26 PM IST

Yuzvendra Chahal: ధనశ్రీ వర్మతో విడాకులకు సంబంధించిన ప్రశ్నలకు భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ ఎట్టకేలకు సమాధానమిచ్చారు. విడాకులకు అసలు కారణం ఏంటో చెప్పేశారు. ఇటీవలి పాడ్‌కాస్ట్ లో తాము విడిపోవడానికి గల కారణాలపై చాహల్ ఓపెన్ అయ్యారు. ఈ నిర్ణయం అకస్మాత్తుగా తీసుకున్నది కాదన్నారు. విడాకులకు ముందు, ఆ తర్వాత తన మానసిక పరిస్థితి, తాను అనుభవించిన మానసిక క్షోభను చాహల్ ఆ పాడ్ కాస్ట్ లో పంచుకున్నారు.

ఈ నిర్ణయం చాలా కాలంగా ఉన్నదే అని చాహల్ వెల్లడించారు. అయితే, తుది నిర్ణయానికి వచ్చే వరకు ఇద్దరూ గోప్యంగా ఉంచాలని నిర్ణయించుకున్నామన్నారు. తమ వ్యక్తిగత విషయాలను బహిరంగపరచకూడదని తామిద్దరం అనుకున్నట్లు వివరించారు. ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో సాధారణ జంటగా కనిపించడం కొనసాగించామన్నారు.

ఎంతో కాలంగా విడిగా ఉన్నా సమాజం కోసం ప్రేమగా ఉన్నట్లు నటించామన్నారు. తమ గురించి అందరూ ఏం అనుకుంటారో అనే భయంతోనే నిజం చెప్పలేకపోయామన్నారు. చాలా కాలంగా సమస్యలున్నా అందరి ముందు బాగున్నట్టే నటించామన్నారు చాహల్.

తన వివాహం విచ్ఛిన్నం కావడానికి గల కారణాలను తెలుపుతూ.. వివాహాన్ని కాంప్రమైజ్ గా అభివర్ణించారు చాహల్. కలిసి సమయాన్ని గడపలేకపోవడం వల్ల దూరం పెరుగుతోందన్నారు. రెండు వైపుల నుండి రాజీ తప్పనిసరి అయినప్పటికీ, కొన్నిసార్లు సరిపోలని వ్యక్తిత్వాలు, స్వభావ వ్యత్యాసాలు ఘర్షణను సృష్టించగలవని, చివరికి సంఘర్షణకు దారితీస్తాయని ఆయన అన్నారు.

తాను, ధనశ్రీ.. ఇద్దరం.. తమ తమ కెరీర్‌లలో బిజీ అయిపోయామని చాహల్ తెలిపారు. ”నేను క్రికెట్ లో, ఆమె వృత్తిపరమైన నిబద్ధతల్లో.. ఇద్దరూ బిజీ అయిపోయాము. దాంతో ఇద్దరం కలుసుకునే సమయం తగ్గిపోయింది. గత రెండు సంవత్సరాలుగా ఈ ఒత్తిడి పెరుగుతోంది. ఇది క్రమంగా మా బంధాన్ని ప్రభావితం చేసింది” అని చాహల్ వివరించారు.

‘ఇద్దరం ఒకరికి ఒకరం సమయం కేటాయించుకోలేపోయాం. నేను జాతీయ జట్టులో ఉండటం, ఆమె తన కెరీర్‌తో బిజీగా ఉండటం కారణంగా మాకు కలిసి ఉండే సమయమే దొరకలేదు. అదే మా మధ్య దూరాన్ని పెంచింది’ అని విడాకులకు అసలు కారణాన్ని బయటపెట్టారు చాహల్. నిరంతర ఒత్తిడి, గందరగోళం తమ మధ్య సంబంధాన్ని ప్రభావితం చేశాయమన్నారు. ఇలాంటి సమస్యలు రోజూ తలెత్తడం ప్రారంభించినప్పుడు, అది చివరికి ఒక వ్యక్తిని వదులుకునేలా చేస్తుందని ఆయన అంగీకరించారు.

ఇక, విడాకుల సమయంలో తనను ఒక చీటర్‌గా ముద్ర వేయడం చాలా బాధించిందని చాహల్ వాపోయారు. ‘నా అంత నమ్మకంగా ఉండే వ్యక్తి మరొకరు ఉండరు. కానీ కొందరు నన్ను తక్కువ చేసి చూశారు. నా గురించి తెలిసిన వాళ్లకి నిజం ఏంటో తెలుసు. కాబట్టి ప్రపంచానికి నేనేంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు’ అని తేల్చి చెప్పారు చాహల్.

డివోర్స్ తర్వాత తాను దారుణమైన పరిస్థితులను ఫేస్ చేశానని చాహల్ ఆవేదన వ్యక్తం చేశారు. బయటకు నవ్వుతూ కనిపించినా మానసికంగా కుంగిపోయానని అన్నారు. కొంత కాలం పాటు డిప్రెషన్‌లోకి వెళ్లానన్నారు. ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చాయన్నారు.

Also Read: బాత్రూమ్‌లో విరాట్ కోహ్లీ వెక్కి వెక్కి ఏడ‌వ‌డం చూశాను : చాహ‌ల్‌