CSK IPL 2025 Full Schedule : చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి షెడ్యూల్ ఇదే.. ప్ర‌త్య‌ర్థులు, మ్యాచ్ తేదీలు, స‌మ‌యం, వేదిక‌లు..

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ షెడ్యూల్ ఇదే..

CSK IPL 2025 Full Schedule details here when and what timing matchs

ఐపీఎల్‌లో అత్య‌ధిక సార్లు టైటిల్‌ను గెలిచిన రెండు జ‌ట్ల‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఒక‌టి. ముంబై ఇండియ‌న్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ మాత్ర‌మే చెరో ఐదు సార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచాయి. మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 18వ సీజ‌న్‌లో విజేత‌గా నిలిచి.. అత్యధిక సార్లు ఐపీఎల్ క‌ప్పును ముద్దాడిన జ‌ట్టుగా నిల‌వాల‌ని సీఎస్‌కే ఆరాట‌ప‌డుతోంది. ఇక ఈ సీజ‌న్‌లో చెన్నై త‌మ తొలి మ్యాచ్‌ను ముంబై ఇండియ‌న్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. మార్చి 23న చెన్నైలోని చెపాక్ వేదిక‌గా ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

గ‌త కొన్ని సీజ‌న్లుగా మ‌హేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ రిటైర్‌మెంట్‌పై ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే.. ధోని మాత్రం అవ‌న్నీ రూమ‌ర్లుగానే మిగిలిపోయేలా.. ఆడుతూ వ‌స్తున్నాడు. మ‌రోసారి ఈ సీజ‌నే ధోనికి చివ‌రిది అని వార్త‌లు వ‌స్తున్నాయి.

IPL 2025 Opening Ceremony : ఐపీఎల్ 18వ సీజ‌న్ ఓపెనింగ్ సెర్మ‌నీ.. శ్ర‌ద్ధాక‌పూర్‌, వ‌రుణ్ ధావ‌న్‌.. ఇంకా..

రుతురాజ్ గైక్వాడ్ నాయ‌క‌త్వంలో చెన్నై బ‌రిలోకి దిగ‌నుంది. ఐపీఎల్ 2024లోనూ రుతురాజ్ కెప్టెన్సీలో బ‌రిలోకి దిగిన చెన్నై ప్లే ఆఫ్స్ చేరుకోలేక‌పోయింది. ఈ సారి ఎలాగైన క‌ప్పును కొట్టాల‌ని భావిస్తోంది.

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ షెడ్యూల్ ఇదే..

మార్చి 23న – ముంబై ఇండియ‌న్స్‌తో – చెన్నైలో – రాత్రి 7.30 గంట‌ల‌కు
మార్చి 28న – రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో – చెన్నైలో – రాత్రి 7.30 గంట‌ల‌కు
మార్చి 30న – రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో – గౌహ‌తిలో – రాత్రి 7.30 గంట‌ల‌కు
ఏప్రిల్ 5న – ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో – చెన్నైలో – మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు
ఏప్రిల్ 8న – పంజాబ్ కింగ్స్ – న్యూ చంఢీగ‌డ్‌లో – రాత్రి 7.30 గంట‌ల‌కు
ఏప్రిల్ 11న – కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌తో – చెన్నైలో – రాత్రి 7.30 గంట‌ల‌కు
ఏప్రిల్ 14 న‌- ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో – ల‌క్నోలో – రాత్రి 7.30 గంట‌ల‌కు
ఏప్రిల్ 20న – ముంబై ఇండియ‌న్స్‌తో – ముంబైలో – రాత్రి 7.30 గంట‌ల‌కు

Champions Trophy : ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చి నిండా మునిగిన పాకిస్తాన్.. త‌ల‌లు ప‌ట్టుకున్న అధికారులు.. ఎన్ని వంద‌ల కోట్ల న‌ష్టమంటే?

ఏప్రిల్ 25న – స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌త్ – చెన్నైలో – రాత్రి 7.30 గంట‌ల‌కు
ఏప్రిల్ 30న – పంజాబ్ కింగ్స్‌తో – చెన్నైలో – రాత్రి 7.30 గంట‌ల‌కు
మే 3న – రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో – బెంగ‌ళూరులో- రాత్రి 7.30 గంట‌ల‌కు
మే 7న – కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో – కోల్‌క‌తాలో- రాత్రి 7.30 గంట‌ల‌కు
మే 12న – రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో – చెన్నైలో – రాత్రి 7.30 గంట‌ల‌కు
మే 14న – గుజ‌రాత్ టైటాన్స్‌తో – అహ్మ‌దాబాద్‌లో -మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు