IPL 2025 Opening Ceremony : ఐపీఎల్ 18వ సీజన్ ఓపెనింగ్ సెర్మనీ.. శ్రద్ధాకపూర్, వరుణ్ ధావన్.. ఇంకా..
మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది.

IPL 2025 Opening Ceremony Shraddha Kapoor Varun Dhawan Ready to Steal the Show
మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ 2025 సీజన్ ఆరంభం కానుంది. మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. డిపెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. ఈ సీజన్ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు అన్ని జట్లు సైతం ఇప్పటికే ప్రాక్టీస్‌ను మొదలుపెట్టాయి. ఈ సీజన్‌లో టైటిల్ విజేతగా నిలవాలని ఆరాటపడుతున్నాయి.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెర్మనీని గ్రాండ్ గా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ వేడుకలో బాలీవుడ్ నటీనటుల డాన్సులు, పాటలతో స్టేడియాన్ని ఊర్రూతలూగించనున్నట్లు సమాచారం.
శ్రద్ధా కపూర్, వరుణ్ ధావన్ డ్యాన్స్ చేయనున్నారట. ఆన్ స్ర్కీన్ కెమిస్ట్రీలో హీట్ పుట్టించే ఈ జంట.. ఐపీఎల్ నైట్‌లో ఉర్రూతలూగిస్తారని భావిస్తున్నారు. వీరికి తోడు పాపులర్ సింగర్ అరిజిత్ సింగ్, శ్రేయ ఘోషాల్ తన పాటలతో యూత్‌ను మైమరపింపజేస్తారని చెబుతున్నారు. వీరే కాకుండా పలువురు బాలీవుడ్ నటీనటులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారని వార్తలు వస్తున్నాయి.
🚨 IPL OPENING CEREMONY. 🚨
– Shreya Ghoshal, Disha Patani and Karan Aujla to perform in Eden Gardens. (Sumit Ghosh/ABP News). pic.twitter.com/jihv1TwjC1
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 17, 2025
మార్చి 22 నుంచి ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కానుంది. మే 25న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు ముంబై, చెన్నై జట్లు అత్యధికంగా చెరో ఐదు సార్లు విజేతలుగా నిలిచాయి. ఆ తరువాత మూడు సార్లు కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.
ఇక పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ వంటి జట్లుకు ఐపీఎల్ ట్రోఫీ అందని ద్రాక్షగానే ఊరిస్తోంది. ఈ సీజన్‌లోనైనా టైటిల్ గెలవాలని ఈ జట్లు పట్టుదలగా ఉన్నాయి. మెగావేలంలో తమకు కావాల్సిన ఆటగాళ్లను సొంతం చేసుకున్నాయి.