CSKvsSRH: చెన్నై టార్గెట్ 176

చెన్నై సొంతగడ్డపై హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ పరవాలేదనిపించారు. ఈ క్రమంలో చెన్నైపై 3 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేయగలిగారు. మనీశ్ పాండే(83; 49బంతుల్లో 7 ఫోర్లు, 3సిక్సులు) నిలదొక్కుకుని అద్భుత ప్రదర్శన చేశాడు.
హైదరాబాద్ ఓపెనర్లలో ఒకరైన డేవిడ్ వార్నర్(57; 45బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు)తో శుభారంభాన్నిచ్చాడు. బెయిర్ స్టో దూకుడుకు కళ్లెం వేయడంతో 2 బంతులు మాత్రమే ఆడి సున్నా పరుగులతో వెనుదిరిగాడు. ఆఖరి ఓవర్లలో బ్యాటింగ్ కు దిగిన విజయ్ శంకర్ (26), యూసఫ్ పఠాన్ (5)మాత్రమే చేయగలిగారు. చెన్నై బౌలర్లు చాహర్ 1, హర్భజన్ 2 వికెట్లు పడగొట్టగలిగారు.