కటక్ వన్డే : భారత్ ముందు భారీ టార్గెట్

  • Published By: veegamteam ,Published On : December 22, 2019 / 12:03 PM IST
కటక్ వన్డే : భారత్ ముందు భారీ టార్గెట్

Updated On : December 22, 2019 / 12:03 PM IST

కటక్ వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక వన్డేలో వెస్టిండీస్ భారీ స్కోర్ చేసింది. భారత్ ముందు చాలెంజింగ్ టార్గెట్ ఉంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. 5 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలవాలంటే 316 రన్స్ చేయాలి. విండీస్ బ్యాట్స్ మెన్ లో వూరన్, కెప్టెన్ పొలార్డ్ చెలరేగారు. హాఫ్ సెంచరీలతో రాణించారు.

వూరన్ 89 (64 బంతులు) పరుగులు చేసి ఔట్ అవగా, పొలార్డ్ 74 (51 బంతులు) పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. వూరన్, పొలార్డ్ లు సిక్సులు, ఫోర్లతో ధాటిగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా పొలార్డ్ సిక్స్ లతో వీరవిహారం చేశాడు. 7 సిక్సులు బాదాడు. విండీస్ భారీ స్కోర్ చేయడంలో వూరన్, పొలార్డ్ కీ రోల్ ప్లే చేశారు. వూరన్ ఇన్నింగ్స్ లో మూడు సిక్స్ లు, 10 ఫోర్లు ఉన్నాయి. పొలార్డ్ ఇన్నింగ్స్ లో 7 సిక్స్ లు, 3 ఫోర్లు ఉన్నాయి. 

భారత బౌలర్లలో సైనీ 2 వికెట్లు తీశాడు. షమీ, జడేజా, ఠాకూర్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. 144 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన విండీస్ ను.. వూరన్, కెప్టెన్ పొలార్డ్ గట్టెక్కించారు. స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించారు. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారికి సిరీస్ దక్కుతుంది. టీమిండియా గెలుపు భారమంతా బ్యాట్స్ మెన్ పైనే ఉంది. మరి మనోళ్లు ఎలా ఆడతారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు.

విండీస్ బ్యాటింగ్:
వూరన్-89
పొలార్డ్-74 నాటౌట్
హోప్-42

భారత్ బౌలింగ్:
సైనీ-2
షమీ, జడేజా, ఠాకూర్ తలో వికెట్