Daniil Medvedev Handed huge Fine After Racket Abuse At US Open
Daniil Medvedev : రష్యా టెన్నిస్ ఆటగాడు డేనియల్ మెద్వెదేవ్(Daniil Medvedev)కు ఈ ఏడాది అంతగా కలిసి రావడం లేదు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో రెండో రౌండ్‌లో, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్‌లలో మొదటి రౌండ్లలోనే ఓటమిపాలైయ్యాడు. ఇక ఇప్పుడు యూఎస్ ఓపెన్‌లో కూడా మొదటి రౌండ్‌లోనే ఓడిపోయాడు. ఫ్రాన్స్ ప్లేయర్ బెంజమిన్ బోంజీ చేతిలో 6-3, 7-5, 6-7 (5), 0-6, 6-4 తేడాతో ఓడిపోయాడు.
ఈ ఓటమి బాధను తట్టుకోలేకపోయిన అతడు తన చేతిలోని రాకెట్‌ను పక్కనే ఉన్న బెంచీకి కొడుతూ విరగొట్టాడు. అంతకముందు మ్యాచ్ సమయంలో ప్రేక్షకులతోనూ అనుచితంగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో టోర్నీ నిర్వాహకులు అతడికి భారీ జరిమానా విధించారు.
Mohammed Shami : రిటైర్‌మెంట్ పై షమీ కీలక వ్యాఖ్యలు.. నా రిటైర్‌మెంట్ ఎప్పుడంటే?
క్రీడాస్ఫూర్తి లేని ప్రవర్తనకు $30,000, రాకెట్ ను విరగొట్టినందుకు మరో $12,500 అంటే మొత్తం 42,500 డాలర్లను ఫైన్ గా విధించారు టోర్నమెంట్ రిఫరీ జేక్ గార్నర్. అంటే భారత కరెన్సీలో దాదాపు 37 లక్షల రూపాయలు.
కాగా.. అతడు తొలి రౌండ్ ఆడినందుకు 1,10,000 డాలర్లు ప్రైజ్‌మనీగా అందుకోనుండగా అందులో మూడో వంతు పైగా జరిమానాగా పడడం గమనార్హం.
తీవ్ర అసహనంతో..
వాస్తవానికి ఈ మ్యాచ్‌లో మెద్వెదేవ్ పోరాటం ఆకట్టుకుంది. వరుసగా రెండు సెట్లు కోల్పోయినప్పటికి కూడా ఆ తరువాత మూడు, నాలుగు సెట్లలో గెలిచి సమంగా నిలిచాడు. అయితే.. ఐదో సెట్‌లో బోంజి గెలవడంలో మెద్వెదేవ్ మ్యాచ్‌లో ఓడిపోయాడు.
Daniil Medvedev looking totally distraught after his loss to Bonzi at the U.S. open.
He’s smashing his racquet and just sitting on the court.
Brutal loss to swallow.
— The Tennis Letter (@TheTennisLetter) August 25, 2025
కాగా.. ఈ మ్యాచ్‌లో మూడో సెట్ పాయింట్‌కు మెద్వెదేవ్ సమీపంలో ఉండగా ఓ ఫోటోగ్రాఫర్ ఆటకు ఆటంకం కలిగించాడు. ఆ సమయంలో మ్యాచ్‌కు ఆరు నిమిషాల అంతరాయం కలిగింది. ఆ తరువాత ఛైర్ అంపైర్ గ్రెగ్.. బోంజీకి మళ్లీ సర్వీస్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నాడు. దీనిపై మెద్వెదేవ్ అసహనం వ్యక్తం చేస్తూ అతడితో వాగ్వాదానికి దిగాడు. ఈ సమయంలో ప్రేక్షకులు నుంచి మెద్వెదేవ్ హేళనను ఎదుర్కొన్నాడు. ప్రతిస్పందనగా అతడు అరుస్తూ వారిని రెచ్చగొట్టాడు. ఆ సెట్ గెలిచిన తరువాత అతడు అసభ్య సైగలు చేశాడు. ఈ క్రమంలోనే అతడికి భారీ జరిమానా పడింది.