David Miller : మాక్స్వెల్ రికార్డును బద్దలు కొట్టిన డేవిడ్ మిల్లర్.. భారత్ పై ఒకే ఒక్కడు..
టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్ (David Miller) అదరగొట్టాడు.
T20 World Cup 2026 David Miller creates history Most sixes against India in T20Is
David Miller : టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్ అదరగొట్టాడు. 35 బంతుల్లో ఏడు ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేసి సౌతాఫ్రికా భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
20 పరుగులకే సౌతాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో బ్రెవిస్(45)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. వీరిద్దరు 97 పరుగుల కీలక భాగస్వామ్యంతో సౌతాఫ్రికాను ఆదుకున్నారు. ఈ భాగస్వామ్యమే భారత్ పై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది.
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో మిల్లర్ మూడు సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో అతడు భారత్ పై టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కాడు. ఈ క్రమంలో అతడు ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ రికార్డును బ్రేక్ చేశాడు. మాక్సీ 22 ఇన్నింగ్స్‌ల్లో 38 సిక్సర్లు కొట్టగా మిల్లర్ 26 ఇన్నింగ్స్‌ల్లో 39 సిక్సర్లు బాదాడు.
టీ20 క్రికెట్లో భారత్ పై అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు వీరే..
* డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా) – 26 ఇన్నింగ్స్‌ల్లో 39 సిక్సర్లు
* గ్లెన్ మాక్స్వెల్ (ఆస్ట్రేలియా) – 22 ఇన్నింగ్స్‌ల్లో 38 సిక్సర్లు
* నికోలస్ పూరన్ (వెస్టిండీస్) – 20 ఇన్నింగ్స్‌ల్లో 35 సిక్సర్లు
* దాసున్ శనక (శ్రీలంక) – 23 ఇన్నింగ్స్‌ల్లో 30 సిక్సర్లు
* ఎవెన్ లూయిస్ (వెస్టిండీస్) – 8 ఇన్నింగ్స్‌ల్లో 28 సిక్సర్లు
