David Warner : ఆస్ట్రేలియన్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ ప్రకటన

ఆస్ట్రేలియన్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ సోమవారం రిటైర్మెంట్ ప్రకటించారు. జనవరి 3వతేదీ నుంచి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో పాకిస్థాన్‌తో తన వీడ్కోలు టెస్ట్ మ్యాచ్‌లో ఆడటానికి ముందు ఓడీఐల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు....

డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ ప్రకటన

David Warner : ఆస్ట్రేలియన్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ సోమవారం రిటైర్మెంట్ ప్రకటించారు. జనవరి 3వతేదీ నుంచి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో పాకిస్థాన్‌తో తన వీడ్కోలు టెస్ట్ మ్యాచ్‌లో ఆడటానికి ముందు ఓడీఐల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. వార్నర్ జనవరి 3 నుంచి తన వీడ్కోలు టెస్టులో పాల్గొననున్నారు. ఐకానిక్ సిడ్నీ క్రికెట్ గ్రౌండులో పాకిస్థాన్‌తో జరగనున్న తన వీడ్కోలు టెస్టు మ్యాచ్‌ను ఆడేందుకు రెండు రోజుల ముందు వార్నర్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు.

ALSO READ : Prime Minister Mody : 2023 సంవత్సరంలో ప్రధాని మోదీ మర్చిపోలేని మధుర చిత్రాలు

2023 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా ఛాంపియన్‌గా నిలిచిన సమయంలో 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ అవుతున్నట్లు వార్నర్ చెప్పారు. సౌత్‌పా తన భార్య కాండిస్, వారి ముగ్గురు కుమార్తెలు ఐవీ, ఇస్లా, ఇండి కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో విజయం సాధించడం మర్చిపోలేనిదని వార్నర్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.

ALSO READ : Nitish Kumar : ఆవులు, బంగారు ఉంగరం, ట్రేడ్ మిల్…ఇవీ బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆస్తులు

అయితే 2025లో పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియాకు టాప్ ఆర్డర్ బ్యాటర్ అవసరమైతే తాను రిటైర్మెంట్ నుంచి బయటకు వస్తానని వార్నర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు 161 ఓడీఐల్లో వార్నర్ 22 సెంచరీలు, 33 అర్ధ సెంచరీలతో 6932 పరుగులు చేశారు.

ALSO READ : Red alert : కొత్త సంవత్సరంలో రెడ్ అలర్ట్ జారీ…ఎందుకంటే…

వార్నర్ 2009జనవరిలో దక్షిణాఫ్రికాపై హోబర్ట్‌లో తన ఓడీఐ ద్వారా అరంగేట్రం చేశారు. రికీ పాంటింగ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, మార్క్ వా, మైఖేల్ క్లార్క్, స్టీవ్ వా తర్వాత ఆరవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వార్నర్ నిలిచారు.