Prime Minister Mody : 2023 సంవత్సరంలో ప్రధాని మోదీ మర్చిపోలేని మధుర చిత్రాలు
కాలగమనంలో కలిసి పోయిన 2023 వ సంవత్సరం మన దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మర్చిపోలేని మధుర స్మృతులను మిగిల్చింది. దేశ, విదేశాల్లోనూ ప్రధాని మోదీ పలు కీలకమైన సమావేశాల్లో పాల్గొన్నారు. గతించిన ఏడాది కాలంలో టాప్ నైన్ మోదీ మర్చిపోలేని మధుర చిత్రాలను పంచుకుందాం రండి...

మన దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభించి ప్రయాణికులతో మాటామంతి
Prime Minister Mody : కాలగమనంలో కలిసి పోయిన 2023 వ సంవత్సరం మన దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మర్చిపోలేని మధుర స్మృతులను మిగిల్చింది. దేశ, విదేశాల్లోనూ ప్రధాని మోదీ పలు కీలకమైన సమావేశాల్లో పాల్గొన్నారు. గతించిన ఏడాది కాలంలో టాప్ నైన్ మోదీ మర్చిపోలేని మధుర చిత్రాలను పంచుకుందాం రండి…మన దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించి ప్రయాణికులతో మాట్లాడారు.

పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రారంభించి సెంగాల్ ను తీసుకువస్తున్న మోదీ…ఢిల్లీలో పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రారంభించిన మోదీ సాధువులు వెంటరాగా సెంగాల్ ను సభలోకి తీసుకువచ్చారు. చిన్నారులకు ఫుట్ బాల్స్ ఇస్తూ మోదీ చిన్నారులతో ముచ్చట్లాడారు. న్యూఢిల్లీలో జరిగిన జీ20 సదస్సులో వివిధ దేశాధినేతలతో మోదీ పాల్గొన్నారు. పీఎం విశ్వకర్మ పథకం ప్రారంభం తర్వాత చేతి వృత్తుల కళాకారులతో మోదీ మాట్లాడారు.

చిన్నారులకు ఫుట్ బాల్స్ ఇస్తూ మోదీ చిన్నారులతో ముచ్చట్లు

చేతి వృత్తుల కళాకారులతో మోదీ మాటామంతీ
గుజరాత్ రాష్ట్రంలో గుంజి గ్రామ గిరిజనులతో మోదీ ఆశీర్వాదం అందుకున్నారు.

జీ20 సదస్సులో వివిధ దేశాధినేతలతో పాల్గొన్న మోదీ
టీం ఇండియా ఓటమి పాలైనప్పుడు అహ్మదాబాద్ నగరంలోని నరేంద్రమోదీ స్టేడియం డ్రెస్సింగ్ రూంలో భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో మోదీ కలిసి ధైర్యం చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ కొండల్లోని భారత ఆర్మీ కేంద్రాన్ని సందర్శించి జాగిలాలకు మోదీ ఫీడింగ్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఛాయ్ వాలా ప్రధాని మోదీ ఉజ్వల యోజన లబ్ధిదారులను కలిసి వారితో టీ తాగారు. మోదీ మర్చిపోలేని మధుర చిత్రాలను ఆయన 2023 డైరీ పేరిట ఆయన వెబ్ సైట్ లో పోస్టు చేశారు.

భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో మోదీ భేటీ

గుజరాత్ రాష్ట్రంలో గుంజి గ్రామ గిరిజనులతో ఆశీర్వాదం అందుకుంటున్న మోదీ

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్వల యోజన లబ్ధిదారులతో టీ తాగుతున్న ఛాయ్ వాలా ప్రధాని మోదీ