Nitish Kumar : ఆవులు, బంగారు ఉంగరం, ట్రేడ్ మిల్…ఇవీ బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆస్తులు
ఆవులు, బంగారు ఉంగరాలు, ట్రెడ్‌మిల్...ఇవీ బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆస్తులు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తనకు రూ.1.64 కోట్ల ఆస్తులున్నాయని తాజాగా వెల్లడించారు.....

Nitish Kumar Owns Cows
Nitish Kumar : ఆవులు, బంగారు ఉంగరాలు, ట్రెడ్‌మిల్…ఇవీ బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆస్తులు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తనకు రూ.1.64 కోట్ల ఆస్తులున్నాయని తాజాగా వెల్లడించారు. సీఎం నితీష్ వద్ద రూ. 11.32 లక్షల విలువైన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు, రూ. 1.28 లక్షల విలువైన రెండు బంగారు ఉంగరాలు, ఒక వెండి ఉంగరం, రూ.1.45 లక్షల విలువైన 13 ఆవులు, 10 దూడలు, ట్రెడ్‌మిల్, మైక్రోవేవ్ ఓవెన్ వంటి ఇతర చరాస్తులు ఉన్నాయి.
ALSO READ : Red alert : కొత్త సంవత్సరంలో రెడ్ అలర్ట్ జారీ…ఎందుకంటే…
ఢిల్లీలోని ద్వారకలో ఉన్న అపార్ట్‌మెంట్ మాత్రమే సీఎంకు ఉన్న స్థిరాస్తి. దీని ధర 2004వ సంవత్సరంలో 13.78 లక్షలు, ఇప్పుడు దాని విలువ రూ. 1.48 కోట్లు. ఆదివారం సాయంత్రం బీహార్ కేబినెట్ సెక్రటేరియట్ డిపార్ట్‌మెంట్ ముఖ్యమంత్రి, ఆయన కేబినెట్ సహచరుల ఆస్తులను వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది.
ALSO READ : Union Home Minister Amit Shah : తెహ్రీక్ ఏ హురియత్ సంస్థపై కేంద్రం బహిష్కరణ వేటు
సీఎం నితీష్ కుమార్ వద్ద రూ.22,552 నగదు, రూ. 49,202 వివిధ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు ఉన్నాయి. గత సంవత్సరం సీఎం మొత్తం ఆస్తులు రూ. 75.53 లక్షలుగా ప్రకటించారు. ఢిల్లీ అపార్ట్‌మెంట్ విలువ పెరగడం వల్ల సీఎం ఆస్తుల విలువ పెరిగింది. ఉప ముఖ్యమంత్రి తేజస్వి ప్రసాద్ యాదవ్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ.4.74 లక్షల ఆదాయాన్ని ప్రకటించారు.
ALSO READ : Ram Mandir QR code scam : రామమందిరం పేరిట క్యూఆర్ కోడ్ స్కాం…హిందూ సంస్థల హెచ్చరిక
రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆయన అన్నయ్య తేజ్ ప్రతాప్ ఆస్తుల విలువ రూ.3.58 కోట్లుగా చూపించారు. బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రుల ఆస్తుల ప్రకటన చర్చనీయాంశంగా మారింది.